కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'నక్షత్రం' సినిమా ఆడియో విడుదలైనా, అందులో సాయిధరమ్‌తేజ్ నటిస్తున్నా కూడా ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఏర్పడటం లేదు, బయ్యర్లు వెనకడుగు వెస్తున్నారట. ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ బజ్ రాలేదు. ఇక ఈ చిత్రంలోని సాంగ్స్ ప్రోమోలను కూడా విడుదల చేశారు. కాగా అందులో మాస్‌కి కిక్ ఇచ్చేలా రెజీనాతో పాటు సాయిధరమ్‌తేజ్ సరసన స్పెషల్‌రోల్ చేస్తున్న ప్రగ్యాజైస్వాల్ అందాలు మాత్రం యువతరానికి కిక్కు ఇస్తున్నాయి.
సాయి, ప్రగ్యల మద్య శృంగారభంగిమలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కాగా ఈ హంగులు, అందాలు చాలవన్నట్లు కృష్ణవంశీ ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రియాశరన్‌పై ఓ ఐటం సాంగ్ కూడా తీశాడు. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా ఈచిత్రానికి అదనపు హంగులు ఉండాలనే ఆలోచనలో అప్పటికప్పుడు 'టైం లేదు గురూ..' అనే పాటను రికార్డ్ చేయించి, శ్రియా అందాలను తెరపై పరిచాడు. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు ఉన్న శ్రియా ఐటం సాంగ్‌ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
కొత్త అందాలైన రెజీనా, ప్రగ్యాజైస్వాల్‌ల పుణ్యమా అని శ్రియా పాట ఎలాంటి బజ్ క్రియేట్ చేయకపోగా, ఆన్‌లైన్‌లో కూడా దీనిని పట్టించుకునే నాధుడే కనిపించకపోవడంతో శ్రీయతో పాటు కృష్ణవంశీ, ఇతర యూనిట్ నిరుత్సాహపడుతున్నారు. మరి సినిమా రిలీజైన తర్వాతనైనా ఈ చిత్రంలోని శ్రియ ఐటంసాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది....!