పాపం కొరటాల

Update: 2017-10-06 14:00 GMT

మహేష్ బాబు స్పైడర్ తో డీలా పడ్డ మహేష్ ఫాన్స్ ని మళ్ళీ ఉత్సహంలోకి లాగేందుకు మహేష్ తదుపరి చిత్రం భరత్ అనే నేను పిక్ ని సోషల్ మీడియాలో వదిలినట్టుగా ఈ రోజు శుక్రవారం ఉదయం నుండి మహేష్ బాబు సీఎం లుక్ అంటూ ఒక పిక్ హల్చల్ చేస్తుంది. ఈ పిక్ లో మహేష్ స్టైలిష్ సీఎం గా సెక్యూరిటీ గార్డ్స్ తో.. వెనుకగా సెక్రటరీతో హడావిడి చేసేస్తున్నాడు. ఆ పిక్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న మహేష్ ఆ సినిమాలో పొలిటిషన్ గా సీఎం గా కనబడనున్నాడు.

అయితే ఇప్పుడు నెట్ లో లీక్ అయిన ఆ పిక్ భరత్ అనే నేను ప్రీ లుక్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఆ పిక్ నెట్ లో లీక్ అయిన కొన్ని గంటల తర్వాత ఆ సినిమా దర్శకుడు కొరటాల హడావిడిగా లైన్ లోకొచ్చి దయచేసి సోషల్ మీడియాలో ఎవరూ ఈ ఫోటోను షేర్ చేయవద్దని.. మహేష్ అభిమానులు కూడా ఇది పక్కాగా ఫాలో అవ్వాలని విన్నవించాడు. ఈ సినిమాకి మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు చిత్ర బృందం అంతా ఎంతో శ్రమిస్తున్నట్లుగా చెప్పిన కొరటాల.. ఈ పిక్ లీక్ విషయంలో మాత్రం బాగానే డిస్టర్బ్ అయ్యాడనుకుంటా. అందుకే ఈ లీకెడ్ పిక్ ని మరికొంతమందికి షేర్ చెయ్యకుండా ఆపడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాడు.

అసలు ఈ పిక్ లీక్ ఎక్కడి నుంచి జరిగిందనే విషయంపై చిత్ర బృందం నెత్తి నోరు కొట్టుకుని మరీ మల్లగుల్లాలు పడుతోంది. అసలు తాము ఆ పిక్ ని మీడియాలో వాడలేదని.. ఎవరో కావాలనే ఈ పిక్ ని లీక్ చేశారని కూడా కొరటాల చెబుతున్నాడు. మరి నిజంగానే ఇలాంటి లీకెడ్ పిక్స్ ని చూసేకంటే మంచిగా చిత్ర బృందం వదిలే ఫ్రెష్ పిక్స్ ని చూడడంతోనే మజా ఉంటుంది కానీ... జనాలు ఎక్కడాగుతారు.

Similar News