పాపం కైరా అద్వానీ

Update: 2018-03-13 11:15 GMT

డైరెక్టర్ కొరటాల ఫోకస్ మొత్తం కథపైన.. హీరో క్యారక్టర్ పై ఉంటది. తన మొదటి సినిమా నుండి హీరోయిన్స్ కి తన స్క్రిప్ట్ లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు. హీరోస్ ని ఎలా చూపించాలో అన్నదానిపైనే తన ఫోకస్ మొత్తం ఉంటుంది. ప్రస్తుతం తాను తీస్తున్న భరత్ అనే నేను సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తుంది.

ఈ సినిమాలో కైరా అద్వానీ క్యారక్టర్ జనతా గ్యారేజ్‌లో హీరోయిన్ల పాత్ర ఎంత పరిమితమో అంతేనట. మహేష్ లాంటి పెద్ద స్టార్ సినిమాలో హీరోయిన్ లేకపోతే సమస్య అవుతుంది కనుక పేరుకి మాత్రం ఒక హీరోయిన్‌ని పెట్టారట. అసలు ఈ సినిమాలో ఈ హీరోయిన్ తక్కువసేపే ఉంటుందంట. సాంగ్స్ అవసరం ఉన్నప్పుడల్లా ఆలా వచ్చి వెళ్ళి పోతుందట.

అందుకే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో హీరోయిన్‌ షాట్‌ ఒక్కటి కూడా లేదట. ఈ సినిమాలో మహేష్ సెక్రటరీగా కైరా కనిపిస్తుందని, అతనిపై మనసు పారేసుకుని ఊహల్లో పాటలు పాడుకునే సగటు హీరోయిన్‌గా దర్శనమిస్తుందని తెలిసింది. వచ్చేనెల ఏప్రిల్ లో 5వ తేదీతో షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తవుతుంది. అదే నెల ఏప్రిల్‌ 20న వరల్డ్ వైడ్ ఈ సినిమా విడుదలకి రంగం సిద్ధమవుతోంది.

Similar News