ఈ మధ్యన ఇంద్రగంటి మోహన కృష్ణ - సుధీర్ బాబు కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసిన అదితి రావు ఉన్నట్టుండి ఈ సినిమా నుండి తప్పుకుందని.. ఆమె పారితోషకం ఎక్కువ డిమాండ్ చేస్తే.. దానికి నిర్మాతలు ఇవ్వనన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరిగింది. అయితే బాలీవుడ్ నుండి వచ్చిన హీరోయిన్ కదా.. అందుకే పారితోషకం విషయంలో నిజంగానే ఇంద్రగంటి సినిమాని అదితి వదులుకుందని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక వెబ్ మీడియాలో కూడా ఇంద్రగంటి - సుధీర్ బాబు సినిమా నుండి అదితి అవుట్ అంటూ కథనాలు కథనాలు ప్రసారం అయ్యాయి.
కానీ అదంతా ఒట్టి పుకారే అని..ఇంద్రగంటి - సుధీర్ బాబు.. సినిమాలో అదితి నే హీరోయిన్ గా ఫైనల్ చేసారని.. అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాకపోయినా. అక్కడ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్న అదితి రావు తాజాగా చెలియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కార్తీ, అదితి జంటగా మణిరత్నం తెరకెక్కించిన చెలియా సినిమా డిజాస్టర్ అయినప్పటికీ అదితి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు సుధీర్ బాబు తో కలిసి స్ట్రయిట్ తెలుగు మూవీలో నటిస్తుంది .
ఇక అదితి కూడా ఇంద్రగంటి సినిమాలో సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్లుంది.. అందుకే నా ఫస్ట్ తెలుగు సినిమా అంటూ..నేను పుట్టిన హైదరాబాద్ లో సినిమా స్టార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉందని ట్వీట్ చేసింది.