స్పైడర్ సినిమా ఎలా రిలీజ్ అయిందో... అలా గోడకి కొట్టిన బంతల్లే డిజాస్టర్ అయింది. ఈ సినిమా కొనుకున్న బయ్యర్స్ ని నిలువునా ముంచేసింది. అటు ఇటుగా దాదాపు 60 కోట్లు నష్టం వచ్చింది. అయితే సినిమా చేసిన వాళ్ళు... చూసిన వాళ్ళు ఈ సినిమాను పూర్తిగా మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యిపోయారు. ఇలాంటి టైం లో స్పైడర్ కు సంబంధించి ఓ పోస్టర్ వచ్చింది.
యాభై రోజుల పోస్టర్...
రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ఈ సినిమా ప్లాప్ టాక్ వచ్చింది. సినిమా ఫైనల్ రన్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కడ ఆడటం లేదు. స్పైడర్ గురించి మర్చిపోయి మహేష్ తన నెక్స్ట్ మూవీ భరత్ అనే నేను లో బిజీ అయిపోయాడు. ఇక డైరెక్టర్ మురగదాస్ కూడా విజయ్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ లో బిజీ గా వున్నాడు. ఇలాంటి టైమ్ లో స్పైడర్ సక్సెస్ ఫుల్ గా 50రోజులు పూర్తిచేసుకుందంటూ నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు.
గాయాన్ని మళ్లీ రేపి....
మర్చిపోటానికి ట్రై చేస్తున్న టైంలో ఇలా 50 డేస్ పోస్టర్ రీలీజ్ చేసి పాత గాయాన్ని మళ్లీ రేపారు నిర్మాతలు. అయితే జీ తెలుగు ఛానెల్ ఈ సినిమాను ఏకంగా పాతిక కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ రైట్స్ కొనుక్కుంది. కనీసం టీవీలో అయినా ఈ సినిమాకు మంచి రేటింగ్ వస్తే అటు మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఇటు ఛానెల్ వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి.