పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనీ చూస్తుంది. చేసిన నాలుగు సినిమాలతో.. ఎప్పటినుండో వెండి తెరకి దూరంగానే వుంది. సడన్ గా 'నీతోనే డ్యాన్స్' అంటూ బుల్లితెర మీద అడుగేసింది. అయితే ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఆ షో సక్సెస్ కాకపోవటంతో.. అందులో జెడ్జ్ గా ఉన్న రేణు దేశాయ్.. వెండితెర మీద తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందని తెలుస్తుంది.
ఇప్పుడు ఆమెపై మీడియాలో ప్రముఖంగా ఓ న్యూస్ వినపడుతుంది. మలయాళ వెండితెర మీద రేణు దేశాయ్ రీఎంట్రీ ఇవ్వడానికి ఓకె చెప్పేసిందట. వయసు రీత్యా ఆమె ఎటువంటి పాత్ర వేయబోతోందన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్. హీరోకో హీరోయిన్ కో తల్లి గానో.... లేదా అక్క క్యారెక్టర్ చేస్తూ.. పాత్ర సైజు, ప్రాధాన్యతల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే రేణు దేశాయ్ ఓ మలయాళం మూవీ కూడా సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ మోలీవుడ్ లో సక్సెస్ అయితే.. అట్నుంచి తెలుగులోకొచ్చి.. రమ్యకృష్ణ, నదియా, జయసుధ లాంటి మిడిలేజ్ ఆర్టిస్టులకు పోటీగా మారినా మారొచ్చు అనే టాక్ వినబడుతుంది. ఆమె టాలీవుడ్ కి మళ్ళీ తిరిగి వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెకు వెల్కమ్ చెప్పటానికి కూడా రెడీగా ఉన్నారంటున్నారు . మరి నిజంగానే రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందో లేదో ఆమె నోటి వెంట చెప్పేదాకా వెయిట్ చేయక తప్పదు