పవన్ వెనుక త్రివిక్రమ్ నీడ!

Update: 2017-12-06 08:40 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటినుండి పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు త్రివిక్రమ్, పవన్ వెంట వున్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? పవన్ - త్రివిక్రమ్ కలిసి జల్సా సినిమా చేసినప్పటినుండి వీరి మధ్యన దర్శక హీరో బంధం కాస్తా.. స్నేహబంధంగా మారిపోయింది. అప్పటినుండి పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటున్నాడు త్రివిక్రమ్. పవన్ ఎక్కడ ఉంటే త్రివిక్రమ్ అక్కడ ఉండడం దగ్గరనుండి.. అన్ని విషయాల్లోనూ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కి మంచి ఆప్తుడిగా దగ్గరయ్యాడు. కేవలం సినిమాల్లోనే కాదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుండి పవన్ వెనుక త్రివిక్రమ్ ఉన్నాడు. పవన్ మాట్లాడే ప్రతి మాట త్రివిక్రమ్ చేతి రాతే అని ప్రచారం జరిగింది అక్షరాలా నిజం.

అందుకే త్రివిక్రమ్ ని మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందనే ప్రచారం కూడా జరిగింది. అసలు ఇప్పుడు ఇంత సోది ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాల్తో బిజీగా ఉంటూనే మరోపక్క రాజకీయాల్లో బిజీగా మారుతున్నాడు. 2019 ఎన్నికలను టార్గెట్ గా జనసేన కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్ గా మారడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పాద యాత్ర కూడా చేపట్టబోతున్నాడు. అందులో భాగంగానే.. చలోరే చలోరే చల్... జనం లోకి జనం కోసం జనసేనాని అంటూ పవన్ కళ్యాణ్ బయలుదేరాడు.

అయితే పవన్ కళ్యాణ్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే అంటూ చెప్పే ముందుగా పవన్ కళ్యాణ్ ఆప్తుడు, మిత్రుడు అయిన త్రివిక్రమ్ వాయిస్ ఆ ఆడియో లో స్పష్టంగా వినబడుతుంది. ఆ ఆడియో మొదట్లో త్రివిక్రమ్ వింటారా! వెనకాలే వస్తారా! తోడుగఉందాం వస్తారా! రండి విందాం.... అటూ చెప్పగా.. పవన్ కళ్యాణ్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్

మిత్రమా! అసలే చీకటి! ఇల్లేమో ధూరం! దారంతా గోతులు! చేతిలో దీపం లేదుధైర్యమే ఒక కవచం... రా అంటూ గర్జిస్తూ...ఒక దేశపు సంపద నదులు కాదు... ఖనిజాలు కాదు.. అరణ్యాలు కాదు.. కలలు ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశపు భవిష్యత్తుకు నాయకులు.

మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వారికి ఇదే చెబుదాం. పర్వతం ఎవరిముందు వంగి సలాం చెయ్యదు. నేను పిడికిలంతా మట్టే కావచ్చు.. కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా మోసేంత పొగరుంది అంటూ ఆవేశపూరితమైన మాటలు వింటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయి రాజకీయనాయకుడిలా కనబడుతున్నాడు. మరి త్రివిక్రమ్ మాటలు పవన్ చేతలు చూస్తుంటే.. ఈసారి జనసేనాని మాత్రం గట్టిగా కొట్టేలాగే కనబడుతున్నాడు.

Similar News