ప్రస్తుతం ఫేమ్ లో లేని వారు యూట్యూబ్ చానెల్స్ వారికి ఇంటర్వూస్ ఇచ్చి ఇండస్ట్రీ లో వున్న పెద్ద స్టార్స్ పై నోరు పారేసుకుని హైలైట్ అవటం కామన్ అయిపోయింది. మనసులో అనుకుంది ఏ మాత్రం మొహమాటం లేకుండా పబ్లిక్ మీడియాలో చెప్పేస్తున్నారు. అయితే రీసెంట్ గా కూడా ఓ నటి అందరు అవాక్కయ్యేలా తన ఆవేదనను చెప్పేసింది. ప్రస్తుతం ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రేండింగ్ అవుతుంది.
ఏ ఫిలిం బై అరవింద్ 2 ద్వారా తెలుగు కు పరిచయం అయిన శ్రీ రెడ్డి మల్లిడి తెలుగు ఇండస్ట్రీ లో ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. ఆమె చేసింది తక్కువ సినిమాలే. " తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గట్టిగానే ఉంది. తెలుగు అమ్మాయిలంటే ఎందుకు అంత చులకన. మేము అందంగా ఉండమా..మేము అందరి లాగా వర్క్ ఔట్స్ చేయమా. అసలు పెద్ద పెద్ద స్టార్స్ తెలుగు అమ్మాయిలతో సినిమాలు చేయడానికి ఇష్టపడరు" అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా వదల్లేదు. " పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్స్ తెలుగు అమ్మాయిలతో ఎందుకు చేయరు. తెలుగు బాషా అంటే అంత ఇష్టం వున్నవారు తెలుగు హీరోయిన్స్ తో కానీ విల్లన్స్ తో కానీ ఎందుకు చేయరు. మాకు కూడా ఛాన్స్ ఇవ్వొచ్చుగా. సమంత, ప్రణీత లాంటి వారే కావాలా. తెలుగులో కూడా అందమైన అమ్మాయిలు వున్నారుగా. మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. మా గురించి కూడా ఆలోచించండి" అంటూ మాట్లాడింది శ్రీ. పాలిటిక్స్ లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ కు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వరకు చేరతాయా? ఒకవేల ఆయన స్పందించినా కూడా ఎలాంటి లాభం ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రశ్న.