పవన్ దయతోనే గెలిచాడా?

Update: 2017-09-25 14:00 GMT

శివబాలాజీ, హరితేజ, ఆదర్శ్,అర్చన, నవదీప్ బిగ్ బాస్ సీజన్ వన్ ఫైనల్ కంటెస్టెంట్స్ గా వున్నారు. అయితే ప్రేక్షకుల ఓట్ల వల్లే వారు ఫైనల్ విన్నర్ అవుతారని బిగ్ బాస్ వ్యాఖ్యాత ఎన్టీఆర్ మొదటి నుండి చెబుతున్నమాట. వారానికి కొన్ని లక్షల ఓట్లు పెంచుకుంటూ పోతున్న బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి 1100 కోట్ల పైమేర ఓట్లు తో బిగ్ బాస్ నిలిచిందని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక ఫైనల్ విన్నర్ 3 కోట్ల పైమేర ఓట్లతో బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ అయ్యాడని కూడా ఎన్టీఆర్ చెప్పాడు. ఫైనల్ విన్నర్ గా శివబాలాజీ నిలవగా... రెండో స్థానంలో ఆదర్శ కేవలం 8 లక్షల ఓట్లతో వెనకబడ్డాడు. ఇక మూడో స్థానంలో హరితేజ నిలిచింది.

అయితే ఇపుడు బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన శివబాలాజీ పవన్ ఫ్యాన్స్ కారణంగానే సీజన్ వన్ విన్నర్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఎందుకంటే మల్టి టాలెంటెడ్ హరితేజ బిగ్ బాస్ విన్నర్ అవుతుందని అనుకున్నవారికి శివబాలాజీ విన్నర్ అవడం బాగా ఆశ్చర్యాన్ని కలిగించిందనే టాక్ వుంది. అయితే హరితేజ క్యాంపెయినింగ్ సరిపోక ప్రేక్షకుల ఓట్లు పడలేదని... పవన్ ఫ్యాన్స్ అందరూ శివ బాలాజీకి ప్రత్యేక క్యాంపెయినింగ్ చేయడంతోనే శివ గెలిచాడంటున్నారు.

అందుకే సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయాన్నే బిగ్ బాస్ షోలో మన దేవుడు.. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని ఐన శివబాలాజీ విజయానికి... వోట్ వేసిన పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ధన్యవాదాలు.. శివబాలాజీ గారికి కంగ్రాట్స్అంటూ పోస్ట్ ల మీద పోస్ట్ లు చేస్తూ జై పవర్ స్టార్... జై పవనిజం.. అంటూ స్లోగన్స్ కూడా. అయితే శివబాలాజీ కి పవన్ ఫాన్స్ క్యాంపెయిన్గ్ చెయ్యడానికి కారణం ఏంటబ్బా అంటే.... పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన అనేక సినిమాల్లో శివబాలాజీ మంచి పాత్రల్లో మెరిశాడు.గతంలో అన్నవరం సినిమాలో పవన్ చెల్లెలికి భర్తగా చేసిన శివబాలాజీ, మొన్నటికి మొన్న కాటమరాయుడులో పవన్ కే తమ్ముడిగా మెప్పించాడు. ఇక ఆ సినిమా స్పాట్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి శివబాలాజీ తీయించుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని గట్టిగా తాకడంతోనే.... బిగ్ బాస్ లో మన దేవుడు.. అంటూ శివబాలాజీని పవన్ ఫ్యాన్స్ పనిగట్టుకుని మోసేశారని.. వోటింగ్ లో శివబాలాజీని గెలిపించారని'ఒక టాక్ నడుస్తోంది.

Similar News