పవన్ డాన్స్ లో ఎంత వీకంటే...?

Update: 2017-12-20 11:00 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో నటనతో ఇరగదీసినా.. డైలాగ్స్ తో అదరగొట్టినా కానీ... డాన్స్ ల విషయానికి వచ్చేసరికి మాత్రం తేలిపోతాడు. అందుకే డాన్స్ మాస్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా ఈజీ స్టెప్స్ ని మాత్రమే కంపోజ్ చేస్తారు. అయితే తాను డాన్స్ లో వీక్ అనే విషయాని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నాడు. నిన్న మంగళవారం రాత్రి నోవెటల్ లో జరిగిన అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో తాను డాన్స్ లో వీక్ అన్నాడు. ఇదంతా పవన్ చెప్పడానికి అసలు కారణమేమిటంటే...

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ గురించి మాట్లాడినప్పుడు.. అతని పాటలెంత గా ఇష్టమో అని చెప్పే క్రమంలో తన డాన్స్ విషయాన్ని బయటపెట్టాడు. అనిరుద్ గతంలో కంపోజ్ చేసిన కొలవెరి.... ఢీ అనే పాట పవన్ కి చాలా ఇష్టమైన పాటని... ఆ పాట చాలా సార్లు వింటూ ఉంటానని... ఒక్కడినే ఉన్నపుడు డ్యాన్స్ చేసే పాట అది అని....ఆ డాన్స్ మీరెవరూ చూడలేదు కూడా. సినిమాల్లో డ్యాన్స్ చేయకపోవచ్చేమో కానీ.. ఒక్కడినే ఉన్నపుడు మాత్రం ఎంతో కొంత ఊగుతాను. అలా నాకు మైకేల్ జాక్సన్ తర్వాత అంత ఇష్టమైన మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్. అంటూ అనిరుధ్ ని పొగుడుతూ తన డాన్స్ వీక్నెస్ ని చెప్పేసాడు పవన్ కళ్యాణ్.

ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి జనవరి 10 న సంక్రాతి కానుకగా విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటించగా.. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది.

Similar News