పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా అజ్ఞాతవాసి ప్రస్తుతం వారణాసి లో చివరి షెడ్యూల్ లో బిజీగా వుంది. అక్కడ వారణాసి నుండే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టైటిల్ లోగోని విడుదల చేశారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇకపోతే వారణాసి లో పవన్ కళ్యణ్ కి సంబందించిన కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అందులో ఒక పిక్ లో పవన్ కళ్యాణ్ నీటిమీద పడవలో కూర్చుకుని దేనికోసమో నిరీక్షిస్తున్న ఫోటో ఒకటి.... మరోకటి అజ్ఞాతవాసి సీన్ కి సంబందించిన పిక్.
అయితే పవన్ కళ్యాణ్ పడవలో కూర్చుని ఒంటరిగా దేని గురించో.. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఆ పిక్ ని చూసిన వారంతా... పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇలాంటి లైఫ్ నే కోరుకుంటాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడు. ఒక్కడే కూర్చుని ఇలా ఆలోచనలతో ఉంటాడు. మరి ఇప్పుడు కూడా దేని గురించో పవన్ అంతలా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటున్నారేమో.. పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చుని గంగ హారతి కోసం నిరీక్షిస్తున్నాడట. అలాగే మరో పిక్ కూడా అజ్ఞాతవాసికి షూటింగ్ పిక్ అన్నమాట.
మరి ఇలా పిక్స్ ని బయటికొదులుతూ అజ్ఞాతవాసి టీమ్ అప్పుడే గట్టిగా ప్రమోషన్ మొదలెట్టేసింది.. అని అనిపించడం లేదు. మరి డిసెంబర్ లో ఆడియో... సినిమా జనవరి 10 న వచ్చేస్తున్నాయి కాచుకోండి పవన్ ఫాన్స్. ఇక ఇదొక్కటే ఫాన్స్ కి ఆనందాన్నిచ్చే విషయం కాదు.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి విడుదల కాగానే వేదాళం రీమేక్ ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. నేసన్ దర్శకత్వంలో ఏ. ఏం. రత్నం నిర్మాణంలో ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో పట్టాలెక్కే ఛాన్స్
ఉంది.