పవన్ అజ్ఞాతవాసి చివరి సినిమా కాదు

Update: 2017-11-29 08:00 GMT

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలానే రీమేక్ మూవీస్ లో నటించాడు. అసలు అలా రీమేక్ చేసిన సినిమాతోనే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి చేరువయ్యాడు. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'దబంగ్' కి రీమేక్ గా వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న త్రివిక్రమ్ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమాని తమిళ సినిమా కి రీమేక్ చేసాడు.

అయితే పవన్ కళ్యాణ్ గత ఏడాది తమిళ్ హిట్ సినిమా అయిన 'వేదాలం' సినిమా కి రీమేక్ గా ఒక సినిమా ని గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. ఆ సినిమా చాలాకాలం నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుని ఇప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకెళ్లే సమయం ఆసన్నమైందంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని నిన్న మంగళవారం సోషల్ మీడియా సాక్షిగా ఒక న్యూస్ హల్చల్ చేసింది. అయితే ఈ సినిమాని తమిళ దర్శకుడు అయిన నేసన్ డైరెక్ట్ చేయనున్నాడనే విషయం అందరికి తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా ని ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ అయిన ఏ.ఏం.రత్నం నిర్మిస్తున్నాడు. అనుకోకుండా ఈ సినిమా పట్టాలెక్కే టైం వచ్చేసరికి.. ఇప్పుడు ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమాలో పవన్ పక్కన నటించబోయే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు. అలాగే ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10 సంక్రాతి కానుకగా విడుదల కాబోతుంది.

Similar News