అక్కినేని నాగార్జున అటు వ్యాపార రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ సక్సెస్ ఫుల్ వ్యక్తిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం హీరోగా, నిర్మతగా నాగార్జున తనదైన మార్క్ చూపెడుతున్నాడు. ఇప్పుడు నాగార్జున తన రెండో కుమారుడు అక్కినేని అఖిల్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అఖిల్ నటించిన తొలి సినిమా అఖిల్ ఎంతగా ఫ్లాప్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా ఫ్లాప్ అయ్యాక అఖిల్ కి రెండో సినిమా కష్టం.... ఒకవేళ అఖిల్ కి రెండో సినిమా ఉన్నా గాని బిజినెస్ అవ్వడం కష్టం అని అన్నారు అంతా. కాని అక్కినేని నాగార్జున మాత్రం చాలా తెలివిగా హలో సినిమాని నిర్మించి అంతే తెలివిగా బిజినెస్‌ని పూర్తి చేసాడు.
అలాగే నాగార్జున చాలా తెలివిగా ఈ సినిమా కి విక్రమ్ కె కుమార్‌ను దర్శకుడిగా ఎంచుకుని బలమైన కంటెంట్‌తో సినిమా చేయించాడు. ఇప్పటికే హలో సినిమా యొక్క టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్నిఆకట్టుకున్నాయి. అదే విధంగా మంచి టైమింగ్ లో హలో సినిమాకి సరైన ప్రమోషన్లు కూడా చేయడంతో బయ్యర్లలో సినిమాపై బాగానే నమ్మకం కలిగించాడు నాగ్. అఖిల్ అంత పెద్ద డిజాస్టర్ అయినా హలో థియేట్రికల్ రైట్స్ ని 32 కోట్లకు అమ్మడం.... అలాగే ఓవర్సీస్ రైట్స్ మాత్రమే 3 కోట్లకు ఇవ్వడం చిన్న విషయం కాదు.
అయితే ఇదంతా కేవలం నాగార్జున ప్లానింగ్ వల్లే జరిగింది అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. వీటితో పాటు జి ఛానల్ వారికి హలో శాటిలైట్ రైట్స్ ని 5.5 కోట్లకు ఇవ్వడం కూడా నాగ్ ప్లానింగ్ లో భాగమే. దీన్ని బట్టి నాగార్జున వ్యాపార తెలివితేటలూ ఏ రేంజ్ లో ఉన్నాయో అనిపిస్తుంది కదు. ఇకపోతే అఖిల్ - కళ్యాణి జంటగా తెరకెక్కిన హలో సినిమా వహ్చే శుక్రవారమే విడుదల కానుంది.