'పద్మావతి' చిత్రానికి అడ్డంకులు తొలిగిపోయి పేరు మార్చుకుని ఈ నెల 26 న విడుదల అని మీడియాలో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో షాక్ తగిలింది. 'పద్మావతి చిత్రాన్ని ‘పద్మావత్’ గా పేరు మార్చి జనవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న చిత్ర బృందానికి కర్ణిసేన సభ్యులు అడ్డుతగిలారు. పద్మావత్ చిత్రంలో అన్ని పాత్రల పేర్లు మార్చి చిత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కర్ణిసేన సభ్యుడు ఒకరు మాట్లాడుతూ 'ఈ చిత్రాన్ని మొదలుపెట్టిన మొదటి రోజు నుండే మేము ఈ చిత్రాన్ని నిషేధించాలి అని నిర్ణయించుకున్నాము. సీబీఎఫ్సీ వారు వేసిన కమిటీ చిత్రాన్ని చూసింది. ఈ చిత్రంలోని కథ.. నిజమైన చరిత్రను వక్రీకరించింది. సినిమా డబ్బులు కోసం చేశారు.. అందుకే ఈ చిత్రం పేరు , అందులోని పాత్రల పేర్లు మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో ప్రధాని మోడీ స్పందించాలని మేము కోరుతున్నాము. ఇప్పటి వరకు చట్టాన్ని దృష్టిలో పెట్టుకొనే మా నిరసనను తెలిపాము. ప్రధాని మోడీ ఈ విషయం పై స్పందించకపోతే జరిగే అనర్ధాలకు కేంద్ర ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుంది...' అని అన్నాడు. మరి సినిమాలో పేర్ల మార్పు జరగకపోతే ఏ ఈనెల 26 న కూడా పద్మావతి సినిమా విడుదల కష్టమే అంటున్నారు.
ఇకపోతే రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ చిత్రంలో పద్మావతిగా దీపికా పదుకొణె నటించగా.. అలావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించాడు.