పద్మావతిగా ఇరగదీస్తున్న దీపికా

Update: 2017-09-21 10:00 GMT

బాజీరావ్ మస్తానీ వంటి చారిత్రాత్మక చిత్రంలో మెప్పించిన దీపికా పదుకొనె.... మరోమారు బాజీ రావు మస్తానీ దర్శకుడు సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో పద్మావతి చిత్రంలో నటిస్తుంది. బాజీరావ్ రావు మస్తానితో సూపర్ హిట్ కొట్టిన సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రానికి దీపికా పదుకొనె స్టార్ హీరోలతో సమానంగా భారీ పారితోషకం అందుకోవడం, దీపిక పదుకొనె బాయ్ ఫ్రెండ్ రణవీర్ సింగ్ ఈ పద్మావతి చిత్రం లో నెగెటివ్ రోల్ పోషించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి వుంది.

ఇక చారిత్రాత్మక కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషస్తున్న దీపికా పదుకొనె..... పద్మావతి లా ఎలా వుండబోతుందో అనే క్యూరియాసిటిలో బాలీవుడ్ ప్రేక్షకులు కొట్టేసుకుంటున్నారు. అయితే దీపికా పదుకొనె, పద్మావతి లుక్ ని చిత్ర బృందం రివీల్ చేసింది. పద్మావతి టైటిల్ లోగోని నిన్న బుధవారం విడుదల చేసిన చిత్ర బృందం.... ఈరోజు గురువారం పద్మావతి ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. టైటిల్ రోల్ పోషిస్తున్న పద్మావతి లుక్ లో దీపికా పదుకొనె అదిరింది. వంటినిండా బంగారు ఆభరణాలు ధరించడమే కాదు... అందమైన చీరకట్టుతో ఆకట్టుకునేలా వుంది. మొత్తంగా రాజస్థానీ రాచరిక లుక్‌తో.. ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది అని చెప్పాలి. ఈ చిత్రంలో దీపిక భర్త రతన్‌సింగ్‌గా షాహిద్‌ కపూర్‌ , అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు పద్మావతి ఫస్ట్ లుక్ లో అధికారికంగా ప్రకటించారు.

Similar News