దీపికా పదుకొనె - షాహిద్ కపూర్ - రణ్వీర్ సింగ్ కాంబోలో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రం పద్మవత్... విడుదలకు ముందు అష్టకష్ఠాలు పడింది. కనీసం సినిమాకి సెన్సార్ అవ్వనివ్వకుండా... సినిమా విడుదల కాకూండా కర్ణిసేనలు ఎంతాగా రచ్చ చేశాయో చూసాక పద్మావత్ సినిమా విడుదల కావడం గగనం అనుకునే పరిస్థితి వచ్చింది. మరి భారీ బడ్జెట్ తో భారీ సెట్టింగ్స్ తో భారీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ముందు కలిగిన అవాంతరాల వలన సినిమా మీద కొంతమంది లో ఆసక్తి ఏర్పడగా.. మరికొంతమందిలో.. ఆసక్తి చచ్చిపోయింది. ఎట్టకేలకు జనవరి 25 న విడుదలైన ఈ సినిమాని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. అయినా కూడా ఈ సినిమా సూపర్ టాక్ తెచ్చుకోవడం, అసలు ఈ పద్మవత్ లో రాజవంశీయులు కించపరిచే విధంగా ఎటువంటి డైలాన్ గాని సీన్స్ లేకపోవడంతో సినిమా దేశమంతటా విడుదలై ప్రభంజనం సృష్టించింది.
దీపికా మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమా 50 రోజులను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడమే కాదు... 300 కోట్ల క్లబ్‌లో పద్మవత్ చోటు సంపాదించుకుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో తెలియజేశాడు. అంతేకాదు బాలీవుడ్ లో 300 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా పద్మవత్ చరిత్ర సృష్టించింది. మరి ఒక లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇలా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల తో సమానంగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది.