దాదాపు రెండేళ్లు గాప్ తీసుకుని వెండితెరపై సందడి చేయబోతున్నాడు మన మాస్ మహారాజ్ రవి తేజ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' చిత్రంలో రవి తేజ అంధుడిగా నటిస్తున్నాడు. పటాస్, సుప్రీం వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన అనిల్ రావిపూడి ఈ చిత్రంతో హ్యాట్రిక్ సొంతం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక రవి తేజ కూడా రెండేళ్ల విరామం తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఇద్దరికీ కీలకంగా మారింది ఈ చిత్రం.
అయితే రాజా ది గ్రేట్ ప్రమోషన్స్ లో బిజీగా వున్న రవి తేజ, ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో.. అసలు పటాస్ నేను చేయాల్సిన సినిమా.... కానీ కొన్ని కారణాలు వల్ల ఆ సినిమా నేను చేయలేకపోయాను.అయితే ఆ కారణాలు మీకు చెప్పినా... అవి సిల్లీగ ఉంటాయి అంటూ సరదాగా చెప్పాడు రవి తేజ. ఇక ఈ రాజా ది గ్రేట్ సినిమాలో రవి తేజ కి జోడిగా క్యూట్ భామ మెహ్రీన్ కౌర్ నటిస్తుంది. ఇక రవితేజ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా ఈ నెల 18 న విడుదల కాబోతుంది.