డ్రగ్స్ కేసులో సినీ సీలెబ్రిటీస్ కి నోటీసులు పంపడమే తడువుగా వారిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. పూరి, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్ లను విచారంచిన సిట్ అధికారులు ఈ రోజు మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ని విచారణకు పిలిచారు. అయితే నిన్న సోమవారం సిట్ అధికారుల ముందు హాజరైన నవదీప్ మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా సిట్ అధికారుల ప్రశ్నలు ఎదుర్కొన్నట్టు చెబుతున్నారు. అన్ని పక్కాగా అనుకుని ప్రిపేర్ అయ్యాడని... ఎన్ని ప్రశ్నలు వేసిన ముందుగా నో చెప్పిన నవదీప్ ఆ తరవాత కీలక సమాచారం సిట్ అధికారుల ముందు పెట్టాడని అంటున్నారు.
అయితే నవదీప్ తాను డ్రగ్స్ తీసుకోనని.... తనకి ఒక పబ్ ఉన్న మాట నిజమేనని.... ఆ పబ్ లో ఎటువంటి డ్రగ్స్ దందా జరగడం లేదని సిట్ అధికారులకి చెప్పినట్లు సమాచారం. అలాగే నవదీప్ అందరిలా కాకుండా తన బ్లడ్ శాంపిల్స్ ని, గోళ్ళని, జుట్టుని సిట్ అధికారులకి ఇవ్వడానికి ఒప్పుకోలేదని అందుకే నవదీప్ దగ్గరనుండి వాటిని సిట్ అధికారులు సేకరించలేకపోయాయారని చెబుతున్నారు. ఇక నవదీప్ ని ను సిట్ అధికారులు దాదాపు 11 గంటలపాటు ప్రశ్నించారు. పలు విషయాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారని చెబుతున్నారు.
ఇక విచారణ ముగించుకుని బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడారు. తనని సిట్ అధికారులు ఈవెంట్ మేనేజర్ లింక్ కు సంబంధించి సమాచారం అడిగారని తన దగ్గర ఉన్న సమాచారం అంతా క్లియర్ గా వారికి చెప్పానని నవదీప్ అన్నారు. అవసరమైతే సిట్ అధికారులు తనకి ఫోన్ చేస్తామని చెప్పారని నవదీప్ మీడియాకి వెల్లడించాడు.