న్యూ ఇయ‌ర్ సాక్షిగా మళ్లీ మంచు విష్ణు తండ్ర‌య్యాడు... మ‌ళ్లీ షాకే

Update: 2018-01-01 15:15 GMT

క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు ఫ్యామిలీలో న్యూ ఇయ‌ర్ కానుక‌గా గుడ్ న్యూస్‌. మోహ‌న్‌బాబు తాత‌య్యాడు. మోహ‌న్‌బాబు పెద్ద కుమారుడు అయిన మంచు విష్ణు భార్య విరోనిక ఈ రోజు మ‌ళ్లీ త‌ల్లి అయ్యారు. గ‌తంలో తొలి కాన్పులో విరోనిక ఇద్ద‌రు క‌వ‌ల ఆడ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రెండో కాన్పులో ఆమె మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. సోమ‌వారం సాయ‌త్రం నూత‌న సంవ‌త్స‌రం రోజున ఈ బిడ్డ పుట్ట‌డం విశేషం.

విష్ణు భార్య విరోనిక దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడి కుమార్తె అన్న విష‌యం తెలిసిందే. విరోనిక‌కు డిసెంబ‌ర్ 2, 2011లో అరియానా, వివియానా అనే క‌వ‌ల పిల్ల‌లు పుట్టారు. ఇప్పుడు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని మ‌రోసారి చూడ‌గా ఇప్పుడు మ‌గ బిడ్డ పుట్టాడు. కొద్ది రోజులుగా విరోనిక ప్రెగ్నెంట్ అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ సారి కూడా విష్ణు, విరోనిక జంట‌కు క‌వ‌ల పిల్ల‌లే పుట్ట‌బోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మ‌గబిడ్డ మాత్ర‌మే పుట్ట‌డం విశేషం. ఇక విష్ణు త‌న‌కు ఇప్ప‌టికే ఇద్ద‌రు ఆడ పిల్ల‌లు ఉండ‌గా ఈ సారి కూడా మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టాల‌ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

త‌న‌కు ఇప్ప‌టికే అరియానా, వివియానా అనే వార‌సురాళ్లు ఉన్నార‌ని, మూడోసారి కూడా అమ్మాయి పుడితే మూడో వార‌సురాలు అవుతుంద‌ని, అదే అబ్బాయి పుడితే వార‌సుడు అవుతాడ‌ని, వార‌స‌త్వానికి అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేదని విష్ణు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సారి కూడా విష్ణు ఆడ‌పిల్ల‌ను కోరుకుంటే మ‌గ‌బిడ్డ పుట్టి విష్ణు ఇంట వార‌సుడు ఉద‌యించాడు. తండ్రి అయిన సంద‌ర్భంగా విష్ణుకు, తాత అయిన సంద‌ర్భంగా మోహ‌న్‌బాబుకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

Similar News