చందమామ కథలు చిత్రానికి జాతీయ పురస్కారం హోదా దక్కటంలో, నేటి తరం వారికి సరిగ్గా పరిచయం లేని హీరో రాజశేఖర్ తో పి.ఎస్.వి.గరుడ వేగా వంటి ప్రయోగాత్మక చిత్రం చేసి ప్రేక్షకులని ఆకట్టుకోవడం వెనుక వున్న ఒకే వ్యక్తి దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫేమ్ సంపాదించుకునే అరుదైన చిత్రాలని తెరకెక్కించిన ఈ దర్శకుడు ఇప్పుడు తన ఆవేదన వెలిబుచ్చుకునే క్రమంలో విదేశీ ప్రేక్షకులని ఉద్దేశించించి నోరు జారీ వారిని హర్ట్ చేసి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు పాపం.
ఒక ఫిలిం క్రిటిక్ నిర్వహించిన రౌండ్ టేబుల్ డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు పైరసీ విషయమై మాట్లాడుతూ, పైరసీ ప్రింట్ లలో సినిమాలు చూసేది ఎం.ఆర్.ఐ లేనని, వారికి ఐదు డాల్లర్లు వెచ్చించి పిజ్జా తినటం తెలుసు కానీ సినిమా ని అత్యంత క్వాలిటీ తో ఆస్వాదించటం తెలియదు అని వ్యాఖ్యానించారు. దీనికి నొచ్చుకున్న విదేశీ తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రవీణ్ సత్తారు పై విమర్శలు మొదలు పెట్టేశారు. నిజానికి పి.ఎస్.వి.గరుడ వేగా వసూళ్ల పరంగా స్వదేశం లో కంటే అమెరికా, కెనడా వంటి దేశాలలోనే అత్యధిక వసూళ్లు రాబట్టి పంపిణీదారులకి ఊరట కలిగించింది. మరి ప్రవీణ్ సత్తారు వ్యాఖ్యల దుమారం ఇంకెంత దూరం తీసుకెళ్తుందో మరి.