నేను హైదరాబాద్ కి రాలేనన్న నటి!

Update: 2017-11-23 11:00 GMT

బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ ఎవరంటే దీపికా పదుకొనె పేరు చెబుతారు . కుర్రకారును కిర్రెక్కిన్చే అందం దీపికది . స్త్రీ ప్రధానమైన సినిమాలకు కూడా ఆమె పెట్టింది పేరు. చూడటానికి నాజూకుగా ఉన్నా ఎలాంటి పాత్రనైనా అవలీలగా ధరించగల సమర్ధవంతమైన నటి. తాజాగా ఆమె పద్మావతి చిత్రం పుణ్యామా అని రోజూ వార్తల్లో నిలుస్తుంది . దీపిక రాజపుత్ రాణి పద్మావతి పాత్రలో నటించినప్పటి నుంచి కస్టాలు, మానసిక వేదన వెన్నాడుతూ వున్నాయి. బయట స్వేచ్ఛ గా తిరగలేని పరిస్థితి.

పద్మావతి పాత్రలో నటించినందుకు రాజపుత్ నాయకులతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఆమె తలకు వెల కట్టారు. ఈ చర్య దీపికను ఎక్కువ బాధించింది . 28న హైదరాబాద్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది . ఆ రోజు నగరంలో అంతర్జాతీయ వ్యాపార సదస్సు జరగబోతున్నది . ఈ సదస్సుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక తో పాటు 150 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు . భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నారు . ఈ సదస్సులో రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం దీపికకు ఆహ్వానం పంపింది . ఇది అరుదైన ఆహ్వానం . కానీ దీపిక పాల్గొనలేనని చెప్పింది .

కారణం ఆమె ప్రాణానికి ప్రమాదం పొంచి ఉండటం కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీ నాయకులూ పద్మావతి చిత్రంపై అవాకులు చవాకులు పేలుతున్నా , సెన్సార్ వారు ఇబ్బందులు పెడుతున్నా ప్రధాని నోరు మెదపకపోవడం దీపికను భాదించి ఉండవచ్చు . అందుకే ఇలాంటి అతి ముఖ్యమైన సదస్సులో పాల్గనలేనని చెప్పింది. ఎంతైనా ఆర్టిస్టులు చాలా సున్నితంగా వుంటారు . అందులో దీపిక మరీనూ

Similar News