నేను సినిమాలు మానేస్తున్నానంటే... వినరా.. ఈ మాటన్నదెవరో మీకు తెలుసా? అదేనండి రాజకీయాలంటూ ఈమధ్యన తెగ హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్. సినిమాలు మానేస్తున్నాని చెబుతున్నాడే గాని ఎక్కడా క్లారిటీ మాత్రం ఇవ్వకుండా సినిమా రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చెయ్యాలి. ఎందుకంటే అడ్వాన్స్ లు తీసుకుని ఉన్నాడు. కానీ ఆ సినిమాల మీద కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వకుండా రాజకీయాల్లో బాగా బిజీ లైఫ్ ని గడుపుతున్నాడు.
ఇక ఇప్పుడు తాజాగా ఒకే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అవతరమెత్తి.... ఎక్కువగా నోరు పారేసుకుంటూ..ఆ బ్లాక్ బస్టర్ హిట్ ఆ తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చెయ్యకుండా చిన్న చితక సినిమాలు చేస్తూ.. మొన్నీమధ్యనే ఒకస్టార్ హీరోతో సినిమాని తెరకెక్కించి టాక్ బాగోపోయినా... మంచి కలెక్షన్స్ తెచ్చుకుని హిట్ అనిపించుకున్న సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ఒకరు పవన్ కళ్యాణ్ ని కలిసి మంచి స్టోరీ ఉంది వినండి సారూ అన్నాడట. మరి పవన్ కళ్యాణ్ కి వీర విధేయుడిని అని బయట చెప్పుకుంటూ తిరిగే ఆ దర్శకుడు కథ చెప్పగానే పవన్ వింటాడనుకుని ఆశ పడ్డాడట.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏమయ్యా.. నేను సినిమాలు మానేస్తానని చెబుతూనే ఉన్నాను... అసలు మానేసానని కూడా చెప్పాను. అయినా నువ్వొచ్చి కథ వినిపిస్తానంటే ఎలా అంటూ పంపేసాడట. ఇక ఆ దర్శకుడు పవన్ సారూ మీరు ఈ కథతో సినిమా చేస్తే అటు రాజకీయాలకు కూడా పనికొస్తుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా పవన్ సారూ వినలేదంటే... ఇక పవన్ ఖచ్చితంగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే.