నేను మ‌ల‌యాళీ కాదు..తమిళియన్ ని

Update: 2017-10-23 13:00 GMT

'ప్రేమమ్' మలయాళం సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించారు.. ఈ ముగ్గురిలో సాయి పల్లవికి మరియు అనుపమ పరమేశ్వరన్ కి బాగా పేరు వచ్చింది. వారిద్దరూ ఒక్కసారిగా ఫెమస్ అవడమే కాదు వరసపెట్టి ఇద్దరు తెగ సినిమాలు మీద సినిమాలు చేసేస్తున్నారు. 'ప్రేమ‌మ్' సినిమాతో మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల ప్రేమ‌ను సంపాదించుకున్న సాయిప‌ల్ల‌వి.. 'ఫిదా' సినిమాతో తెలుగు వారినీ ఫిదా చేసేసింది. ప్రస్తుతం ఆమె 'ఎమ్‌సీఏ' సినిమాలో నాని స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అయితే ఈ సినిమాలో నానితో ఆమెకు పడడం లేదని, తెలుగు సినిమాలు ఆమె ఇక చేయాల‌నుకోవ‌డం లేద‌ని మన టాలీవుడ్ సర్కిల్స్ లో పుకారులు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాద‌ని ఇటీవ‌ల సాయిప‌ల్ల‌వి కొట్టిపారేసింది. తాజాగా మ‌రో విష‌యం ఆమెకు కోపం తెప్పిస్తోందట‌. ఎక్క‌డికి వెళ్లినా ఆమెను మ‌ల‌యాళీ అమ్మాయిగానే ట్రీట్ చేస్తున్నార‌ట‌. ప్రెస్ మీట్స్ లో కూడా ఆమెను మ‌ల‌యాళీగానే పేర్కొంటున్నారట‌. ఇటీవ‌ల జరిగిన మీడియా స‌మావేశంలో ఓ విలేక‌రి మ‌ల‌యాళీగా సంబోధించ‌డం సాయి పల్లవికి ఆగ్ర‌హం తెప్పించింద‌ట‌.

ఆలా సాయి పల్లవికి కోపం రావడం తప్పేమీలేదు ఎందుకంటే ఆమె మ‌ల‌యాళీ కాదు.. త‌మిళ అమ్మాయి. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరుకు స‌మీపంలోని కోట‌గిరి ఆమె జ‌న్మ‌స్థలం. ఇవ‌న్నీ ఆ విలేకరికి వివరించి ఇక‌పై త‌న‌ను మ‌ల‌యాళీగా పేర్కొనవ‌ద్ద‌ని సూచించింద‌ట‌. ప్రస్తుతం సాయి పల్లవి నానితో 'ఎమ్‌సీఏ' సినిమా షూటింగ్లో బిజీగ వుంది.

Similar News