నేను చెయ్యను అంటే.. దగ్గరుండి మరీ ఒప్పించాడంట

Update: 2017-08-19 11:00 GMT

'పైసా వసూల్' చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా శ్రియ శరణ్, ముస్కాన్, కైరా దత్ లు నటించిన విషయం తెలిసిందే. పూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో బాలకృష్ణ తేడా సింగ్ గా కనబడబోతున్నాడు. అయితే శ్రియ శరణ్ తో ఇంతకుముందే బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు చేసాడు. ఇప్పుడు 'పైసా వసూల్' తో శ్రియకి మూడోసారి ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. అయితే బాల్కకృష్ణ 'పైసా వసూల్' కోసం శ్రియ పేరును సెలక్ట్ చేసినప్పుడు శ్రియ కొంచెం టెన్షన్ పడిందట. ఈ సినిమాలో చెయ్యాలో వద్దో అనే ఆలచనలోనే చాలా రోజులు ఉండిపోయిందట.

అయితే విషయం తెలిసిన బాలయ్య, శ్రియ దగగ్రకి వెళ్లి విషయం అడగగా మనిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది... అందుకే ఈ సినిమా హిట్టవుద్దో లేదో అనే భయంతోనే ఈ సినిమాలో నటించడానికి టెన్షన్ పడుతున్నానని చెప్పిందట. దీనికి బాలకృష్ణ, శ్రియకి ఉన్న భయాన్ని పూరితోపాటే అందరికి చెప్పాడట. అయితే అందరూ 'చెన్నవకేశవ రెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి' హిట్ అయినట్లే ఈ సినిమా కూడా హిట్టవుతుందని బాలకృష్ణతో పాటు భరోసా ఇచ్చాకే శ్రియ ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకుందట. ఇక శ్రియ చెయ్యను అంటే నేను ఒప్పించి ఈ సినిమాలో నటించేలా చేశానని చెబుతున్నాడు బాలయ్య.

నిజంగా శ్రియ హ్యాట్రిక్ మూవీ హిట్ అవ్వదేమో అనే భయంతో ఒప్పుకేలేదా లేకుంటే పూరి డైరెక్షన్ మీద నమ్మకములేక ఒప్పుకోలేదా అనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ మధ్యన పూరి నుండి వస్తున్న సినిమాలేవీ ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. అందుకే శ్రియ ఈ సినిమాలో చెయ్యడానికి అంతలా భయపడి ఉండాలి. ఇక బాలకృష్ణ మీద నమ్మకంతోనే ఈసినిమాలో నటించి ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు.

Similar News