నేను కూడా షాక్ అయ్యా..

Update: 2017-07-14 10:00 GMT

మలయాళ నటి భావన కిడ్నాప్ వ్యవహారంలో మలయాళ స్టార్ హీరో దిలీప్ ని పోలీస్ లు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నటుడు దిలీప్ భావనపై లైంగిక దాడి చేయించాడని ఆధారాలు బయట పడడంతో పోలీసులు దిలీప్ పై విచారణ చేపట్టారు. అయితే పోలీస్ లు తగిననాధారాలు దొరకడంతోనే అతన్ని కస్టడీ లోకి తీసుకున్నామని చెబుతున్నారు. మరో పక్క దిలీప్ అరెస్ట్ తో మలయాళ సినిమా పరిశ్రమకి కోట్లలో నష్టం వచ్చినట్లుప్రచారం జరుగుతుంది. అలాగే మలయాళ పరిశ్రమ కూడా దిలీప్ ని తప్పుబట్టింది. అంతేకాకుండా దిలీప్ కి కఠిన శిక్ష వేయాలంటూ అందరూ ముక్త ఖంఠంతో నినాదాలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు దిలీప్ వ్యవహారంలో పోలీస్ లకు ఒక కొత్త తలనెప్పి స్టార్ట్ అయ్యిందట. కారణం నటి భావన నిందితుడిగా దిలీప్ పేరుని తానెక్కడా ప్రస్తావించలేదని.... అతడ్ని ఎందుకు అరెస్ట్ చేశారో తనకి అర్థం కావడం లేదని.... దిలీప్ అరెస్ట్ విషయంలో మీరెంత షాక్ అయ్యారో నేనూ అంతే షాక్ అయ్యానంటూ ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని మీడియాతో మాట్లాడే స్థితిలో లేనంటూ ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అలాగే కిడ్నాప్ విషయంలో దిలీప్ తప్పు చేసివుంటే శిక్ష అనుభవించాల్సిందేనని.... తనపై జరిగిన అఘాయిత్యంలో దిలీప్ ప్రమేయం ఉందని మాత్రం తాను భావించడం లేదని భావన చెప్పుకొస్తుంది.

అయితే దిలీప్ కి తనకి మధ్యన రియల్ ఎస్టేట్, ఇతర ఆర్ధిక లావాదేవీల్లో గొడవలు జరిగినట్లు మీడియాలో వస్తున్న వార్తల్ని కూడా భావన ఖండించింది. ఎదో చిన్న పర్సనల్ ప్రాబ్లెమ్ వల్ల తమకి చిన్నవిభేదాలు ఉన్న మాట వాస్తవమే కానీ దిలీప్ ఈ పని చేసాడంటే నమ్మలేనంటుంది. మరి భావన దిలీప్ అరెస్ట్ విషయంలో అసలేం చెప్పాలనుకుంటుందో మాత్రం ఎవ్వరికి క్లారిటీలేదంటున్నారు.

Similar News