కెరియర్ స్టార్టింగ్ లో శృతి హాసన్ ఎంత నాజూగ్గా ఉండేదో తెలిసిందే. స్టార్ ఇమేజ్ వచ్చాక కూడా అలానే మెయింటైన్ చేసింది. అయితే ఈ ఏడాది మొదట్లో వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమాలో కొన్ని చోట్ల సన్నగా..కొన్ని చోట్ల మరీ లావుగా కనిపించి ఆశ్చర్యపరిచింది శ్రుతి.
ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా చేయలేదు.. దీంతో ఆమెకు లావుగా ఉండటం వల్లే సినిమాలు రావడంలేదని ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి ఈ విషయమై స్పందించింది. ‘కాటమరాయుడు’లో తానెందుకు అలా కనిపించానో ఆమె వివరించింది.
‘కాటమరాయుడు' సినిమా కన్నా ముందు నేను ఇంకో సినిమా ఒప్పుకున్న. ఆ సినిమా కోసం నేను లావయ్యా. అది కొంచెం ఆలస్యమైంది. అందుకే ‘కాటమరాయుడు’లో కొన్ని చోట్ల సన్నగా.. కొన్ని చోట్ల బొద్దుగా కనిపించాను. అయినా నేను సాధారణ మనిషినే. ఏ మనిషీ జీవితాంతం ఒకే బరువుతో ఉండడు. ఒక్కోసారి లావవుతాం.. తగ్గుతాం. నా శరీరాన్ని నేనో గుడిలా భావిస్తాను. ఈ గుడి ఎలా ఉన్నా నాకిష్టమే. నేను 200 కిలోల బరువు పెరిగినా.. సంతోషంగానే ఉంటా. నా శరీరాన్ని చూసి గర్విస్తా. సినిమా ఆర్టిస్టులు కూడా మనుషులే కదా. బరువు కొంచెం పెరిగినా.. తగ్గినా పెద్ద ఇష్యూ చేయడం సరికాదు’’ అని శ్రుతి చెప్పింది.