నేడు మరోసారి....వివాహం

Update: 2017-10-07 06:21 GMT

అక్కినేని నాగ చైతన్య - సమంత ల వివాహం నిన్నరాత్రి గోవాలోని ఒక రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంతో ఒక్కటైనా చైతూ - సామ్ ల జంట ఈ రోజు శనివారం క్రిష్టియన్ సంప్రదాయంలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు.ఇక నిన్న సముద్రపు ఒడ్డున అదిరిపోయే కల్యాణ మండపంలో నాగ చైతన్య... సమంత నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టి మూడు ముళ్ళు వేసి తనదాన్ని చేసుకున్నాడు. ఇక సమంత కూడా చైతూ కి పూల దండ వేసి మరీ చైతూని తన సొంతం చేసుకుంది. ఇక అధికారికంగా సమంత అక్కినేని ఇంటి కోడలు అయ్యింది. ఈ పెళ్ళికి కేవలం ఇరుకుటుంబాల వారు మాత్రమే హాజరవడంతో సినిమా ఇండస్ట్రీలోని నటీనటులెవరికి ఈ పెళ్ళికి ఆహ్వానం అందలేదు.

ట్వీట్లతో శుభాకాంక్షలు....

అయితే పెళ్ళికి ఆహ్వానం అందకపోతేనేమి అందరూ సోషల్ మీడియాలో ఆ స్వీటెస్ట్ జంటకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. సమంత ఈగ చిత్రంలో నటించిన హీరో నాని అయితే వెరైటీగా చైతు - సామ్ లు కలిసి నటించిన ఫస్ట్ సినిమా పేర్లను అంటే ఏమాయ చేశావేలో నాగ చైటాన్యా పేరు, సమంత పేర్లు అయిన కార్తీక్, జెస్సిలు అని సంబోధిస్తూ కార్తీక్ - జెస్సిలకు ఈ పెళ్లితో ప్రేమకు శుభం కార్డు పడిపోయింది అని సరదాగా విషెస్ తెలిపాడు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అయితే నాగ చైతన్య - సమంత ల జంటను 'శతమానం భవతి' అని ప్రేమతో దీవెనలందిచారు.

కేటీఆర్ కూడా......

ఇక సమంత హ్యండ్లూమ్స్‌కి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందున తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కూడా... మా హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్.. నాకు తెలిసిన వారిలోనే నైసెస్ట్ పర్సన్ అయిన సమంతకు.. చై అక్కినేనికి శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలియజేయాగా.. హీరోయిన్ త్రిష కూడా ప్రేమ కథల పట్ల తనకున్న నమ్మకాన్ని నిలబెట్టిన చైతు - సామ్ కు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. మరి ఈ స్వీటెస్ట్ ప్రేమ జంటకు మనము పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పేస్తే పోలా...!

Similar News