టాలీవుడ్ లో గ్లామర్ షో చెయ్యకపోయినా అందం అభినయంతోనే నెట్టుకొచ్చే హీరోయిన్స్ కూడ ఉన్నారు. ఆ కోవలోకి నిత్య మీనన్, కీర్తి సురేష్, నివేత థామస్ లు మరోకొంతమంది వస్తారు. అయితే తాజాగా టాలీవుడ్ లోకి జెంటిల్ మెన్, నిన్నుకోరి వంటి చిత్రాల తో ఎంట్రీ ఇచ్చిన నివేత థామస్ ఆ చిత్రాలలో హీరో నానితో పోటీపడి మరి నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రెండు సినిమాలతో హిట్ కొట్టిన నివేత, మూడో సినిమాతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసి జై లవ కుశ లో నటించింది. జై లవ కుశ విడుదల సందర్భంగా పలు ఇంటర్వూస్ లో పాల్గొంటున్న ఈ అమ్మడుని ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది.
తనకు ఒకవేళ బాహుబలిలో నటించే అవకాశం వస్తే ప్రభాస్ పాత్రను చేస్తానని చెప్పి యాంకర్ కి షాకిచ్చింది నివేత. రాజమౌళి బాహుబలిని తెరకెక్కించకముందునుండే రాజమౌళికి నివేత పెద్ద ఫ్యాన్ అంట. మరి అంత ఫ్యాన్ అయివుండి ఆయన సినిమాలో అవకాశం వస్తే వదిలేసుకుంటానా... ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటానంటుంది. మరి దీన్ని బట్టి రాజమౌళిని పొగిడేసి అయన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ కొట్టేయాలనే ప్లాన్ లో నివేత ఉందని కొందరంటుంటే... నివేత చెప్పిన ఈ సమాధానం చూస్తుంటే నివేత కి పోరాటాలు చేసే రాజు లేక యోధుడు పాత్రలంటే అంటే బాగా ఇష్టం అని అర్ధం అవుతుంది అంటున్నారు.