సినిమా రంగంలో కథానాయిక గా రాణించాలంటే కేవలం నటన పరంగా ప్రతిభ ఉంటే సరిపోదు. ఆకర్షించే అందం కూడా సొంతమై ఉండాలి. హీరోయిన్ ఆడిషన్స్ కోసం ఏ సినిమా ఆఫీస్ కి వెళ్లినా అందంగా లేని వారు సెలెక్ట్ కావటం సాధ్యపడే పని కాదు. అలానే బాలీవుడ్ లో కథానాయిక అవకాశాల కోసం ప్రయత్నాల వేటలో వున్న ఒక భామ నిర్మాత వినోద్ చోప్రా ఆఫీస్ లో జరుగుతున్న ఆడిషన్స్ లో పాల్గొనగా, వినోద్ చోప్రా ఆ భామకి ఒక షరతు పై తన సినిమాలో అవకాశం ఇవ్వటానికి ఒప్పుకున్నాడట. ఆ షరతు ఏంటంటే పొడుగుగా వున్న తన ముక్కుని కత్తిరించుకుని షేప్ తెచ్చుకోవాలని. అయితే ఈ సర్జరీ లాస్ ఏంజెల్స్ లోని ప్రముఖ శస్త్ర చికిత్సా నిపుణిడివద్ద చేపించుకోవటానికి కావలసిన ఖర్చు అంతా తాను ఇస్తానని చెప్పాడట.
ఇంతకీ ఎవరా భామ? ఈ షరతు కి ఒప్పుకుందా లేదా అని ఆలోచిస్తున్నారా? ఆ కథానాయిక మరెవరో కాదండి. డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మిత పాత్రని పోషించి అందరి హృదయాల్ని దోచుకున్న విద్య బాలన్. ఈ కథ అంతా జరిగింది 2005 లో తన తొలి చిత్రం పరిణీత కంటే ముందు. అయితే నిర్మాత వినోద్ చోప్రా పెట్టిన షరతు కి అంగీకరించనప్పటికీ బాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ ఐన విద్య బాలన్ తాజాగా ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో తన కెరీర్ తొలినాళ్ళ ఊసులని ఇలా నెమరువేసుకుంది.