నాని, నివేత థామస్, ఆది పినిశెట్టి నటించిన 'నిన్ను కోరి' చిత్రం విడుదలైన మొదటి షో నుండే హిట్ టాక్ తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. మల్టిప్లెక్స సినిమాగా విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుందని చెబుతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కోన వెంకట్ డైలాగ్స్, శివ నిర్వాణ డైరెక్షన్, నాని, నివేత థామస్ ల అద్భుత నటన వంటి ప్లస్ పాయింట్స్ తో క్రిటిక్స్ కూడా 'నిన్ను కోరి' చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 'నిన్నుకోరి' తొలిరోజు ఆంధ్ర, తెలంగాణాలలోనే కాక వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఏరియా ఫస్ట్ డే షేర్ (కోట్లలో )
నిజాం 1.69
సీడెడ్ 0.58
నెల్లూరు 0.18
కృష్ణ 0.36
గుంటూరు 0.40
వైజాగ్ 0.58
ఈస్ట్ గోదావరి 0.45
వెస్ట్ గోదావరి 0.32
ఫస్ట్ డే ఆంధ్ర అండ్ తెలంగాణ షేర్ 4.56
రాయ్ & ఓవర్సీస్ 1.68
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 6.2