నిన్నటివరకు మహేష్, బాలయ్య బాబు అన్నారు

Update: 2017-12-05 11:00 GMT

గత రెండు మూడు రోజులుగా బాలకృష్ణ - మహేష్ మల్టీస్టారర్ సినిమాని దర్శకుడు బోయపాటి తెరకెక్కించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ తో చెయ్యబోయే సినిమా కంప్లీట్ కాగానే బాలకృష్ణ - మహేష్ బాబు తో ఒక బడా మల్టి స్టారర్ సినిమాని తెరకెక్కించబోతున్నాడన్నారు. ఇప్పటికే మహేష్ కి బాలయ్య కి బోయపాటి స్టోరీ లైన్ వినిపించినట్లుగా.... ఆ లైన్ కి ఆ ఇద్దరు హీరోలు పడిపోయి ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చెయ్యమని బోయపాటికి చెప్పినట్టుగా వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమా 2018 లాస్ట్ లో సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పారు.

కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ సినిమా తర్వాత ఒక పవర్ ఫుల్ పొలిటికల్ స్టోరీ తో బోయపాటి బాలయ్య బాబుని డైరెక్ట్ చెయ్యబోతున్నాడంటున్నారు. అసలెప్పటినుండో బాలకృష్ణ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న బోయపాటి.. బాలకృష్ణతో 100 వ సినిమానే తెరకెక్కించాల్సి ఉంది. కానీ బాలకృష్ణ అనూహ్యంగా బోయపాటిని తప్పించి క్రిష్ కి ఛాన్స్ ఇవ్వడం అలాగే 101 , 102 కి కూడా బోయపాటికి ఛాన్స్ ఇవ్వకుండా వెయిట్ చేయించడం కూడా బాలకృష్ణ ప్లాన్ లో భాగమంటున్నారు.

అదేమిటంటే బాలకృష్ణ 2019 ఎన్నికల నాటికి బోయపాటితో కలిసి ఒక పొలిటికల్ బ్యాగ్ద్రోప్ ఉన్న సినిమాని చేస్తే అది తన పొలిటికల్ కెరీర్ కి బాగా ఉపయోగపడుతుందని.. అందుకే ఇప్పుడు బోయపాటితో సినిమా చేయకుండా 2018 చివరినాటికి బోయపాటితో ఒక సినిమాని మొదలు పెట్టాలని బాలయ్య ప్లాన్ అట. 2018 అక్టోబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. 2019 మార్చ్ రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకుని ఈ సినిమాను పూర్తి చేస్తారని తెలుస్తోంది.

Similar News