చాలా ఏళ్ళు హిట్ కి మొహం వాచిపోయిన నితిన్ గత కొంతకాలంగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నితిన్, రీసెంట్ గా లై సినిమాలో నటించి తన కెరీర్ లోనే భారీ డిసాస్టర్ ని చవి చూసాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నితిన్ కి నిరాశనే మిగిల్చింది. అయితే లై సినిమా భారీ ఫ్లాప్ అవ్వడం తో నితిన్ చాలా ఆగ్రహం తో ఉన్నాడని... ఆ ఆగ్రహం తన మేనేజర్ అయిన వెంకట్ పై ప్రదర్శిస్తున్నాడు అని తెలుస్తుంది.
ఎందుకంటే లై సినిమా కథని చేయమని చెప్పింది తన మేనేజర్ వెంకట్ అని.... అంతేకాకుండా సరైన సినిమాల కథలు తన దృష్టి కి రాకుండా.. అతనే మేనేజ్ చేస్తున్నాడని... సరైన స్క్రిప్ట్ లు తన దగ్గరకు రాకుండా చేస్తున్నాడని మేనేజర్ పై సీరియస్ గా ఉన్నాడట నితిన్. అందుకే ఇప్పుడు తన దగ్గర ఉన్న మేనేజర్ వెంకట్ ని పీకేసి కొత్త మేనేజర్ కోసం వెదుకులాట ప్రారంభించాడట. మరి నితిన్ ఆగ్రహం బాగానే ఉంది కాని... కథల విషయం లో మేనేజర్ ల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది.
ఎందుకంటే ఇండస్ట్రీలోకి తమ దగ్గర మంచి మంచి కథ లు ఉన్నాయని చాలా మంది హీరోల దగ్గరికి వస్తుంటారు. మరి అందరినీ ఎంకరేజ్ చేస్తే హీరో విలువైన సమయం వృధా అవుతుంది. అలా టైం వెస్ట్ అయినప్పుడు మేనేజర్ పైనే తమ విసుగు ప్రదర్శిస్తారు హీరోలు. కాబట్టి మేనేజర్ అలా కథలను తెచ్చినవారి జాబితాని ఫిల్టర్ చేయాల్సిందే. ఇక సినిమా చేసే ముందు అన్ని ఆలోచించుకున్నాకే హీరో ఆ సినిమాని ఓకే చేయాలి. అంతేకాని మేనేజర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే అది హీరో పరువునే దెబ్బ తీస్తుంది. మరి నితిన్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడనే విషయం మీద క్లారిటీ లేదు.