నితిన్, హను రాఘవపూడి డైరెక్షన్ లో చేసిన లై'' చిత్రం ప్లాపవ్వడానికి రెడీగా వుంది. మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం పూర్ గా ఉండడంతో సినిమా ప్లాపయ్యే పరిస్థితి వచ్చింది. అలాగే సినిమాకి అనుకున్నంత పబ్లిసిటీ చెయ్యలేక చిత్ర టీమ్ చేతులెత్తడంతోనే సినిమాకి ఈ గతి పట్టిందనేది కూడా టాక్ వుంది అదివేరే విషయం. మరోపక్క గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేసిన 'గౌతమ్ నందా' సినిమాకి కూడా కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా ప్లాపయింది. 'గౌతమ్ నందా' సినిమా ప్లాపయినా మేకింగ్ విషయంలో మాత్రం మంచి పేరొచ్చింది.
అయితే ఈ 'గౌతమ్ నందా' కథని ముందుగా సంపత్ నంది, నితిన్ కె వినిపించగా కథ నచ్చక నితిన్ ఆ సినిమా చేయలేదట. ఇక అదే కథతో సంపత్, గోపీచంద్ హీరోగా డైరెక్ట్ చేసాడు. అయితే ఇప్పుడు సంపత్ - నితిన్ కాంబోలో ఒక మూవీ తెరకెక్కనుందనే న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. నితిన్ 'లై' చిత్రం తర్వాత తన సొంత బ్యానర్ లోనే ఒక సినిమా చెయ్యబోతున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత నిర్మాత రాధా మోహన్ కు ఓ సినిమా కూడా కమిట్ అయ్యాడు నితిన్.
మరి ఆ నిర్మాత రాధా మోహన్, సంపత్ డైరెక్షన్ లో 'బెంగాల్ టైగర్' నిర్మించాడు. అందుకే ఈసారి రాధా మోహన్ నిర్మాతగా సంపత్ నంది డైరెక్షన్ నితిన్ సినిమా చేయబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. మరి ఇప్పటికే సంపత్ నంది, నితిన్ కోసం ఒక స్టోరీ లైన్ కూడా రెడీ చేసాడట. మరి ఆ స్టోరీ లైన్ గనక నితిన్ కి నచ్చితే కథని డెవెలెప్ చెయ్యడానికి సంపత్ రెడీగా వున్నాడట. ఇక సంపత్ కి నితిన్ కి కుదిరితే ఆ సినిమా ని నిర్మించడానికి నిర్మాత రాధామోహన్ రెడీగా వున్నాడట