టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ఎవరు అంటే అందరు టక్కున ప్రభాస్ అని చెబుతారు. ప్రభాస్ కి 35 వచ్చేసినా ఇంకా పెళ్లి గురించి ఆలోచిండం లేదు. మొన్నటివరకు బాహుబలి విడుదల కాగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జోరుగా జరిగింది. ఐదేళ్లు పాటు బాహుబలిని ఎంతో కఠోర శ్రమతో పూర్తి చేసాడు. ఆ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ లెవల్ కి ఎదిగిపోయాడు. అందుకే ఇప్పుడు చెయ్యబోయే సాహు చిత్రాన్ని కూడా నేషనల్ లేవల్లోనే చేస్తున్నాడు. తెలుగు, తమిళం,మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఐయితే ఈమధ్యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ తన పెళ్లి గురించిన రూమర్స్ పై స్పందించాడు.
ఇప్పటివరకు తనపై అనుష్కపై వస్తున్న రూమర్లకు చెక్ కూడా పెట్టాడు. రెండు మూడు సినిమాల్లో కలిసి నటిస్తే ఇద్దరి మధ్యన ఎఫ్ఫైర్ ఉందని రూమర్స్ క్రియేట్ చెయ్యడం చూసినప్పుడల్లా నిజంగానే మా మధ్యన ఏమైనా ఉందా అనే అనుమానం వచ్చేస్తుందని నవ్వుతూ చెబుతున్నాడు. అసలు అనుష్క నేను గత తొమ్మిదేళ్లుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్నామని..... ఒకే ప్రొఫెషన్ లో ఉంటె ఇలాంటి రూమర్స్ సహజమని చెబుతున్న ప్రభాస్ తనకు కలలరాకుమారి అంటూ ఎవరు లేరని... అయినా వ్యక్తిగత విషయాలను బయట ముచ్చడించడం పెద్దగా ఇష్టముండదని చెప్పేసాడు. ఇక తన మనసు రోజుకోలావుంటుందని...తనకి నచ్చిన అమ్మాయి దొరకగానే మీ అందరికి చెప్పే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు ప్రభాస్. మరి ఇకనైనా ప్రభాస్ పెళ్లి రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూద్దాం.