నిజంగానే పెళ్లికోసమే షాపింగా?

Update: 2018-03-24 07:18 GMT

బాలీవుడ్ లో స్వీటెస్ట్ లవ్ బర్డ్స్ ఇప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరగడమే గాని పెళ్లి చేసుకుంటాం అనే మాటను మాత్రం బయటికి చెప్పకుండా సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారు దీపికా పదుకొనె మరియు రణ్వీర్ ల జంట. ఎక్కడ చూసిన వీరిద్దరూ కలిసి తిరుగుతుంటారు. అయితే ఈ మధ్యన వీరి పెళ్లి గురించిన వార్తలు బాలీవుడ్ మీడియాలో తరుచు చక్కర్లు కొడుతున్నాయి. అసలు జనవరిలోనే దీపికా పదుకొనె పుట్టినరోజునాడు శ్రీలంక లో దీపికా, రణ్వీర్ సింగ్ లు రింగ్స్ మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.

త్వరలోనే దీపికా, రణ్వీర్ లు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారని... సీక్రెట్ గా వీరి వివాహ ఏర్పాట్లను ఇరువర్గాల కుటుంబాలు వారు చేస్తున్నారని.. పెళ్లిని మాత్రం ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈవార్తలకు బలం చేకూర్చేలా దీపికా అండ్ ఫ్యామిలీ బెంగుళూరులో సీక్రెట్ గా పెళ్లి షాపింగ్ చేస్తున్నారని.. ప్రస్తుతం దీపికా ఆమె తల్లి తో పాటు చెల్లెలు కూడా బెంగుళూరులో పలు జెవెలెరీ షాప్స్ లో పెళ్ళికి సంబందించిన జెవెలరీ షాపింగ్ చేస్తున్నారని.... ఏ షాప్ లో చూసిన వీరి ముగ్గురే కనబడుతున్నారని అంటున్నారు.

ఈమధ్యనే దీపిక పదుకునే కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి ముంబై వెళ్లి రణ్వీర్ సింగ్ కుటుంబసభ్యులతో పెళ్ళికి సంబందించిన అన్ని విషయాలు మాట్లాడారని... అందులో భాగంగానే వెడ్డింగ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారని కూడా ప్రచారం మొదలైంది. ఆ పెళ్లి చర్చల తర్వాత ఇరు కుటుంబాలు కలిసి ముంబై వర్లీలోని ఫోర్ సీజన్స్ లో డిన్నర్ చేస్తూ చాలామందికి కనబడడంతో దీపికా, రణ్వీర్ ల పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ ప్రచారం మొదలైంది. ఇకపోతే ఈ పెళ్లి ముంబైలోనే జరగాలని రణవీర్ కుటుంబం దీపికా కుటుంబ సభ్యులను కోరినట్టు తెలుస్తోంది

Similar News