నిఖిల్ తో కలిసి సూర్య vs సూర్య లో నటించిన హీరోయిన్ గుర్తుందా... గుర్తుండే ఛాన్స్ లేదులెండి. ఎందుకంటే సూర్య vs సూర్య తర్వాత ఆ అమ్మాయి పెద్దగా ఫోకస్ అయిన సందర్భాలే లేవు. ఆ సినిమా హీరో నిఖిల్ కి కాస్త పేరు తీసుకొచ్చినా..... ఆ హీరోయిన్ త్రిధా చౌదరికి మాత్రం పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే త్రిధా చౌదరి సినిమాల్లో మాత్రం పెద్దగా యాక్టీవ్ కాలేకపోయింది. సినిమాల్లో ఎలాగైనా బిజీ కావాలనుకున్న ఆ భామకు ఇక్కడ నిరాశే మిగిలింది. ఎంతగా గ్లామర్ షో చేసినా కొంతమంది హీరోయిన్స్ కి అది కలిసిరాదు. కారణం లక్కు లేకపోవడమే అనేది జగమెరిగిన సత్యం.
సినిమాల్లో గ్లామర్ షో చెయ్యకపోతేనే మనకి సోషల్ మీడియా ఉందిగా.. మన అందచందాలు చూపెట్టడానికి అంటూ హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటుంది. అందులో భాగంగానే సముద్రం నడిబొడ్డున ఒక బికినీ వేసుకుని చేతులతో ముంగురులును స్టయిల్ గా పైకెత్తి అలా అలా తలెత్తి ఆకాశాన్ని చూస్తూ... నా అందాలను ఆస్వాదించండి అంటూ అందచందాలను చూపిస్తూ త్రిధా చౌదరి తన అందాలతో కైపెక్కిస్తుంది. మరి అలా బికిని షో చేస్తే ఏదైనా చిన్న సినిమాలో అయినా వేషం దొరక్కపోతుందా అని ఆశ పడుతున్నట్లుగా కనబడుతుంది అమ్మడు యవ్వారం.
ఎందుకంటే ఈ మధ్యనే మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది లో సందీప్ పక్కన కాసేపు మెరిసింది. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో అమ్మడు యవ్వారం మళ్ళీ మొదటికే వచ్చింది. అందుకే ఇలా బికినీ షోస్ మొదలెడితే పనిజరిగిద్దని పాప మంచి ప్లాన్ చేసింది.