నారా రోహిత్ సినిమాకి సమంత నిర్మాతా..?

Update: 2017-11-21 17:00 GMT

సమంతా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ని కలిపి దున్నేస్తుంది. నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి వంటి విషయాలతో బిజీగా వున్నా కూడా... చేతినిండా సినిమాల్తో బిజీగా వుంది.అసలు నాగ చైతన్య తో పెళ్లి అయిన కూడా సమంతా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇప్పటికీ సమంతా ఇంటి ముందు క్యూ కడుతున్నారు. సమంతా అటు హీరోయిన్ గా బిజీ గా ఉంటూనే... మరోపక్క పలు సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరు మీద ఎంతో మంది పిల్లలకి ఫ్రీ గా ఆపరేషన్స్ చేయిస్తుంది. అలాగే వారి ఆలనా పాలనా కూడా చూసుకుంటూ వారిపట్ల శ్రద్ద తీసుకుంటుంది.

అయితే ఇప్పుడు తాజాగా సమంతా తన మేనేజర్ అయిన మహేందర్ కి డబ్బు సాయం కూడా చేసిందట. ఇంతకీ మేనేజర్ కి డబ్బు సహాయం చెయ్యడం ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి సమంతా మేనేజర్ మహేందర్, నారా రోహిత్ ని హీరో గా పెట్టి 'బాలకృష్ణుడు' అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా ఈ నెల 24 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాని విడుదల చేయడానికి మహేందర్ కి దాదాపు మూడు కోట్ల రూపాయలు అవసరం అయ్యాయట. మరి మూడు కోట్లు అంటే మాటలను కాదు.

అయితే ఆ మూడు కోట్ల రూపాయలను సమంతా మహేందర్ కి ఇచ్చి చివరి నిమిషంలో సినిమా విడుదల ఆగిపోకుండా చూసుకుందట. అలాగే పలు చోట్ల డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన వాటిల్లో కూడా సమంతా ఇన్వాల్వ్‌ అయ్యి సినిమా గురించిన ప్రతి విషయంలో శ్రద్ద తీసుకుందట. మరి ఈ లెక్కన సమంత ఇన్ డైరెక్ట్ గా నారా రోహిత్ 'బాలకృష్ణుడు'కి కి ప్రొడ్యూసర్ గా మారిపోయింది.

Similar News