దిల్ రాజు నిర్మించిన ఏంసిఏ సినిమాకు దిల్ రాజు కి ఎంత వచ్చిందో తెలియదు కానీ... అందులో నటించిన హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఆ సినిమాని బేస్ చేసుకుని ఇద్దరూ కూడా తమ పారితోషికాలు పెంచేసారు. ఈ సినిమా కేవలం వీరి కాంబినేషన్ వల్లే ఆడిందంటే అందరూ ఒప్పుకుని తీరాలి.
నాని మార్కెట్ మొన్నటి వరకు 15 కోట్ల రేంజ్ లో ఉండేది. కానీ ఏంసిఏ సినిమా ముప్పయ్ కోట్ల షేర్ వసూలు వసూల్ చేసింది. దీంతో మార్కెట్ పెరిగిందని భావించి.. నాలుగైదు కోట్ల స్థాయి నుంచి ఒకేసారి తొమ్మిది కోట్లు అడుగుతున్నాడట నాని. నిర్మాతలు కూడా నాని అడిగినంత ఇవ్వటానికి ఇబ్బంది పడకపోవొచ్చు. ఎందుకంటే నాని సినిమాకి అన్ని హక్కులు కలిపి 40 కోట్ల వరకు వసూల్ అవుతాయి. అతని సినిమాకి అయ్యే ఖర్చు 20 కోట్ల లోపే ఉంటది. సో ప్రొడ్యూసర్స్ నాని ఎంత అడిగిన ఇచ్చేటట్లు వున్నారు.
అలానే సాయి పల్లవి కి కూడా ఏంసిఏ కీలకం అయింది. ఒకేసారి తన పారితోషికాన్ని కోటి దాటించేసింది. శర్వానంద్ సినిమాలో నటించడానికి కోటీ పాతిక లక్షల పారితోషికంతో పాటు మరో పాతిక లక్షలు ఇతర ఖర్చులకి అడుగుతోందట. ఆమె క్రేజ్ ద్రుష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వక తప్పదు. ఒకరకంగా చెప్పాలంటే ఏంసిఏ సినిమా వీళ్లిద్దరికీ బలే కలిసొచ్చింది చెప్పొచ్చు.