నాని, బన్నీని పడుకోబెట్టేసాడు!!

Update: 2017-07-10 13:30 GMT

'దువ్వాడ జగన్నాథం' టాక్ బాగోనప్పటికీ కలెక్షన్స్ వర్షంకురిపిస్తుంది.... అంటూ తెగ ప్రచారం జరిగింది. ఇది నిజమో కాదో అనేది సరిగ్గా క్లారిటి లేకపోయినా డైరెక్టర్ గారు మాత్రం గొంతు చించుకుంటున్నాడు. ఇది నిజం కాదని నిరూపిస్తే సినిమాలు చెయ్యనని ఛాలెంజ్ లు విసురుతున్నాడు. ఇక డీజే చిత్రం నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ అల్లు అర్జున్ కున్న క్రేజ్, పూజ అందాలతో ఎలాగో నెట్టుకొచ్చేసిందంటున్నారు గాని కొంతమేర బయ్యర్లు నష్టాలు చవిచూశారనే వాదన లేకపోలేదు. రెండు వారాలు సరైన సినిమాలేక డీజేకి కాలం కూడా కలిసొచ్చింది.

అయితే ఇప్పుడు 'డీజే' కలెక్షన్స్ కి నాని నటించిన 'నిన్ను కోరి' చిత్రం గండికొట్టిందంటున్నారు. నాని - నివేత థామస్ - ఆది నటించిన 'నిన్నుకోరి' చిత్రం గత శుక్రవారమే విడుదలై పాజిటివ్ టాక్ తో సెంటర్స్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ 'డీజే' చిత్రం 'నిన్నుకోరి' ముందు నిలబడలేక చేతులెత్తేసిందనే టాక్ వినబడుతుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 'నిన్నుకోరి' చిత్రం 'డీజే' ని మాములు దెబ్బ మాత్రమే కొట్టిందట. కానీ ఓవర్సీస్ లో 'డీజే' ని నిన్నుకోరి మామూలు దెబ్బకొట్టలేదంట.

'గమ్మునుండవోయ్' అంటూ 'డీజే' లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ లా 'నిన్నుకోరి' డీజే ని పడుకోబెట్టేసిందట. మరి అల్లు అర్జున్ టీమ్ పనిగట్టుకుని వెళ్లి అక్కడ ప్రచారం చేసినా 'డీజే' కి కోలుకోలేని ప్లాప్ ఎదురైందని అంటున్నారు. మరి నాని 'నిన్నుకోరి' చిత్రం మాత్రం మౌత్ టాక్ తో అక్కడ కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు.

Similar News