టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు తాతినేని సత్య కి తెరకెక్కించే సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. రీమేక్ లు తీసే దర్శకుడిగా ఆయనకు పేరుంది. ఎందుకంటే సత్య ఇప్పటి వరకు తీసిన 'భీమిలి కబడ్డి జట్టు, ఎస్ ఎం ఎస్, శంకర' సినిమాలు అన్నీ రీమేక్ లే. ఇక ఈ సినిమాలేవీ బాక్స్ఆఫీస్ దగ్గర హిట్ గా నిలబడలేక చేతులెత్తేసిన సినిమాలే. ఇదిలా ఉంటె తాతినేని సత్య తాజాగా హీరో మరియు నిర్మాత అయిన సచిన్ జోషి హీరో గా 'వీడెవడు' అనే సినిమాని రూపోదించాడు. థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తాజాగా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
అయితే నిన్న శుక్రవారం విడుదలైన 'కథలో రాజకుమారి, ఉంగరాల రాంబాబు, సరసుడు, శ్రీవల్లి' అన్ని సినిమాలకంటే కూడా 'వీడెవడు' కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'వీడెవడు' సినిమా మంచి హిట్ అని చెప్పలేం కానీ ఆ సినిమాలకన్నా ఈ సినిమా ఎంతో బెటర్ అంటున్నారు క్రిటిక్స్ కూడా. అయితే తెలుగులో నాని తో ఆల్రెడీ 'భీమిలి కబడ్డి జట్టు' ని తీసిన తాతినేని సత్య ప్రస్తుతం నాని కి ఒక లైన్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. సత్య తన నెక్స్ట్ సినిమాని నాని హీరోగా చెయ్యాలని డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి.
మరి ఇప్పుడు వరుస విజయాలతో స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్న నాని..... తాతినేని సత్య తో సినిమా చేస్తాడా లేదా అనేది తెలియదు. కాని నాని కి 'అష్ట చమ్మ' లాంటి హిట్ ని ఇచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి మధ్యలో ప్లాపుల బాటలో ఉన్నప్పటికీ నాని ఆయనకు మళ్ళి చాలా ఏళ్ళ తరువాత 'జెంటిల్ మాన్' అనే సినిమా చేసి ఆ దర్శకుణ్ణి ని హిట్ బాటలోకి తీసుకొచ్చాడు. మరి తాతినేని సత్య తో కూడా సినిమా చేసి ఆయన్ని కూడా హిట్ బాటలోకి తీసుకోస్తాడా లేదా అనేది మాత్రం కాస్త సస్పెన్స్ అంటున్నారు.