ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా మంచి ఫామ్ లో వున్న నాని.. సినిమాల సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాడు. మైత్రి మూవీస్ బ్యానర్ లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడని గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నాని ఆ ప్రాజెక్ట్ చేయట్లేదని తెలుస్తుంది.
కథ కథనంలో కొన్ని మార్పులు చెప్పాడంట నాని. కిషోర్ తనదైన శైలిలో కిషోర్ తిరుమల ట్రై చేసినా నాని సంతృప్తి చెందలేదట. దింతో నాని ఆ సినిమా చేయట్లేదని చెప్పేశాడట. అయితే నాని కాదు అనడంతో కిషోర్ ఈ కథను సాయిధరమ్ తేజ్ కు చెప్పాడంట. కథ విన్న సాయిధరమ్ తేజ్ ఒకే కూడా చెప్పినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్...కరుణాకరన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయినా వెంటనే గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నాడు సాయి. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత కిషోర్ తో సినిమా చేసే అవకాశంవుంది. అసలు ఫామ్ లో లేని సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలు అన్న గట్టెక్కిస్తాయేమో చూడాలి.