నాని ఎంసీఏ మొదటి రోజు లెక్కలు

Update: 2017-12-22 10:13 GMT

నాని నటించిన ఎంసీఏ సినిమాకు ఫస్ట్ డేనే మిశ్రమ స్పందన వచ్చింది. ఎంసీఏ ట్రైలర్ విడుదలప్పుడు నుండే... ఈ సిఎంమా రొటీన్ గా ఉంటుందనే టాక్. సినిమా విడుదలయ్యాక కూడా ఈ సినిమాపరమ రొటీన్ గా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎక్కువ ఊహించుకున్న సాయిపల్లవి క్యారెక్టర్ పండలేదనే కామెంట్స్ వినిపించాయి. ఓవరాల్ సగటు సినిమా గా పేరు తెచ్చుకుంది. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం మా సినిమా హిట్ అంటున్నాడు. ఇక ఈ సినిమాకి రివ్యూస్ నెగెటివ్ గా ఉన్నప్పటికీ.. మొదటి రోజు మాత్రం నాని ఎంసీఏ దుమ్ముదులిపింది. నాని కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసింది ఎంసీఏ సినిమా. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు ఫస్ట్ డే 15 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంసీఏకు ఫస్ట్ డే 7 కోట్ల రూాపాయల షేర్ వచ్చింది. ఆ లెక్కలు మీకోసం.

ఎంసీఏ రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొదటిరోజు కలెక్షన్స్ కోట్లలో...

నైజాం – 3.10

సీడెడ్ – 1.10

ఉత్తరాంధ్ర – 0.94

గుంటూరు – 0.69

తూర్పు గోదావరి– 0.57

పశ్చిమ గోదావరి– 0.45

కృష్ణా – 0.47

నెల్లూరు – 0.25

మొదటి రోజు మొత్తం షేర్ – 7.57 కోట్లు

Similar News