నాగ్ మేనకోడలు రీఎంట్రీ!

Update: 2017-11-23 05:00 GMT

ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం మెగా హీరో చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.... అది కూడా అక్కినేని నాగేశ్వర రావు మనవరాలు సుప్రియతో కలిసి. వారిద్దరూ సినిమాల్లోకి అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయితో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అవ్వగా.. సుప్రియా మాత్రం సినిమాల్లోనే కనిపించకుండా మాయమైపోయింది. అక్కినేని ఫ్యామిలీనుండి కూడా చాలామందే సినిమా రంగంలో స్థిరపడ్డారు. వారిలో అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోలే ఎక్కువగా వచ్చారు గాని హీరోయిన్స్ గా పెద్దగా ఎవ్వరు లేరు. నాగార్జునని పెళ్లి చేసుకుని అఖిల్ పుట్టాక సినిమాలకు దూరమైన అమల ఇప్పుడు ఇంతకాలానికి ఒకటి అరా సినిమాల్లో మెరుస్తుంది. అయితే 20 ఏళ్ళ క్రితం సినిమా రంగం నుండి దూరమైన నాగ్ మేనకోడలు, అక్కినేని నాగేశ్వర రావు మనవరాలు సుప్రియ మాత్రం చదువు, పెళ్లి, విడాకులు వంటి వాటితో సతమతమవుతూ అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాల్లో బిజీగా మారిపోయింది.

అయితే మళ్ళీ ఇంతకాలానికి సుప్రియ సినిమాల్లోకి రి ఎంట్రీ ఇవ్వబోతోందనే న్యూస్ నిన్న బుధవారం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. 20 ఏళ్ళ తర్వాత వచ్చిన ఆఫర్ ని సుప్రియ వదులుకోవాలనుకోవడం లేదట. అడివి శేష్ నటిస్తున్న తాజా మూవీగూఢచారిలో ఓ కీలక పాత్రలో సుప్రియ కనిపించనుందట. అడవి శేష్ కు సుప్రియ సోదరుడు అయిన సుమంత్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంలో భాగంగానే... సుప్రియకు అవకాశం రావడంతో.. ఎలాగూ నటనలో సత్తా చాటాలనే ఆసక్తి ఉండడంతో సుప్రియ ఈ ప్రపోజల్ కి అంగీకరించినట్లుగా తెలుస్తుంది. మరి ఇన్నాళ్లకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సుప్రియ ఇప్పుడైనా పదికాలాలు సినిమాల్లో నిలదొక్కుకుంటుందో.. లేకపోతె అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Similar News