నాగార్జున ఈ మధ్యకాలంలో సినిమా నిర్మాణం మీద బాగా ఫోకస్ పెట్టాడు. ఇటు కొడుకులతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న సినిమాల నిర్మాతగా కొనసాగుతున్నాడు. లో బడ్జెట్ తో సినిమా నిర్మిస్తూ సినిమాల మీద సినిమాలు చేస్తూ నిర్మాతగా హిట్స్ కొడుతున్నాడు. అయితే కొడుకు సినిమా హలో తో దెబ్బతిన్న నాగార్జున ఆ తర్వాత నిర్మించిన రంగులరాట్నం సినిమా మీద అస్సలు ఫోకస్ పెట్టలేదు. అలాగే ప్రమోషన్స్ విషయంలోనూ రిలీజ్ డేట్ విషయంలోనూ అంతే. అందుకే ఆ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా జనాలకు తెలియని పరిస్థితి. అయితే ఈ విషయంలో రంగులరాట్నం హీరో అయిన రాజ్ తరుణ్ మాత్రం బాగా హార్ట్ అయ్యాడు.
ఎందుకంటే రంగులరాట్నం ప్రమోషన్స్ విషయంలో చిత్ర బృందం చాలా వీక్ గా ఉండడం... నిర్మాత నాగార్జున కూడా అస్సలు పట్టించుకోకోకపోవడంతో.... యావరేజ్ సినిమా కాస్తా డిజాస్టర్ అయ్యింది. అయితే ఎప్పుడూ సినిమాలు ప్రమోషన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా వుండే రాజ్ తరుణ్ , నాగ్ విషయంలో తల దూర్చడం ఎందుకులే అనుకున్నాడో ఏమో అందుకే ప్రమోషన్స్ విషయంలో నోరెత్తకుండా వున్నాడు. కానీ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి రాజ్ తరుణ్ కి కాస్త జాగ్రత్త వచ్చినట్టుగా వుంది. అందుకే ఈసారి తన సినిమా నిర్మాత ఎంత పెద్ద వ్యక్తి అయినాసరే.. సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ అలాగే సినిమా విడుదల డేట్స్ విషయంలోనూ తన నిర్ణయమే ఫైనల్ అయ్యే విధంగా జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యాడట. ఎందుకంటే రంగుల రాట్నం విషయంలో కేవలం ప్రమోషన్స్ లో మాత్రమే కాకుండా సినిమా విడుదల సమయం కూడా కరెక్ట్ లేకపోవడంతో ఆ సినిమా కి అంత ప్లాప్ టాక్ వచ్చింది. రెండు పెద్ద హీరోల మధ్యలో పులిలా వచ్చి..... పిల్లిలా మారిపోయాడు.