నాగ్ గురించి తెలిసే ఇలా చేశాడా?

Update: 2017-12-17 03:53 GMT

శివ సినిమా వచ్చిన 28 ఏళ్ళ తర్వాత అదే కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్మ ఫామ్ లో లేకపోయినా.. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ చెప్పిన కథ ని గుడ్డిగా నమ్మి సినిమా స్టార్ట్ చేసాడు నాగ్. ఈ సినిమా ఓపెనింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ ఎత్తున జరిగింది.

అయితే రాము ఒకేసారి అన్ని సినిమాలు బుజం మీద వేసుకుని షూట్ చేస్తాడు. ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టుల్ని నెత్తికెత్తుకోవడం వల్ల వర్మ డీవియేట్ అయిపోతాడని.. అందుకే ఎందులోనూ పర్ఫెక్షన్ చూపించలేకపోతున్నాడని నాగ్ మీడియా ముందు అభిప్రాయపడ్డాడు. తన సినిమాకు సంబంధించి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏ సినిమా గురించి పనులు పెట్టుకోవద్దని వర్మకి నాగ్ ముందే చెప్పాడు. అందుకు వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సహా మిగతా ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టాడు. నాగ్ వర్మ తో 10 రోజులు షూటింగ్ చేసి అఖిల్ సినిమా హలో ప్రమోషన్స్ లో బిజీ అయ్యి పోయాడు.

నాగ్ అలా సైడ్ అయ్యాడో లేదో వర్మ కడప అనే వెబ్ సిరీస్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ చేసాడు. ఈ ట్రైలర్ చాలా బోల్డ్‌గా ఉండి చర్చనీయాంశంగా మారింది. ఆయనకు తెలియకుండానే వర్మ ఈ ట్రైలర్ లాంచ్ చేశాడని భావిస్తున్నారు. ట్రైలర్ గురించి కడప వాస్తవ్యులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అని టీవీ ఛానెళ్ల వాళ్ళు చర్చ పెట్టి వర్మను పిలిస్తే.. ఇక అంతే సంగతులు వర్మ ఆ టీవీ చానెల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు నాగ్ సినిమా వదిలేసి. ఇది నాగార్జునకు ఎంతమాత్రం రుచించే విషయం కాదు. ఈ నేపథ్యంలో నాగ్, వర్మ విషయంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.

Similar News