టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకు మంచి జడ్జిమెంట్ ఉందని చెబుతారు. మరి ముఖ్యంగా తన సినిమాల విషయంలో కానీ.. తన ఫ్యామిలి సినిమాల విషయాలలో కానీ.. నాగ్ చాలా పక్కాగా ప్లాన్ చేసి.. ముందే ఫలితాన్ని శాసిస్తాడని అంటారు. అందుకు చాలా రుజువులే కనిపిస్తాయి.
ఈ మధ్య కాలంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సినిమాల విషయంలో నాగ్ ప్రణాళిక ఫలించింది. ఆయన చెపినట్లే ఆ సినిమాలు బాగా ఆడాయి. కానీ అఖిల్ సినిమా 'హలో' విషయంలో నాగ ప్లాన్ ఫెయిల్ అయిందని తెలుస్తుంది.
ఈ సినిమాకు క్రిటిక్స్ నుండి మంచి మార్కులు వచ్చినా.. జనాలు దీనిని అంతగా ఆదరించలేదు. నాగార్జున కూడా ఈ సినిమాకి ఖర్చు పెట్టినట్టు ఏ సినిమాకి పెట్టలేదు. అలానే ఈ సినిమా కోసం ఇన్వాల్వ్ అయినట్టు మరి ఏ సినిమాకి అవ్వలేదు. రామ్ గోపాల్ వర్మతో మొదలుపెట్టిన సినిమాను ఆపి మరీ.. ‘హలో’ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ల మీద ఫోకస్ చేశాడు. వీకెండ్లోనే అంతంతమాత్రంగా ఉన్న ‘హలో’ వసూళ్లు.. ఆ తర్వాత బాగా పడిపోయాయి. కనీసం రూ.20 కోట్ల షేర్ మార్కునైనా అందుకుంటుందేమో అనుకుంటే అదీ జరగలేదు. ఇప్పటికి రూ.17 కోట్లకు అటు ఇటుగా ఉంది ‘హలో’ వరల్డ్ వైడ్ షేర్.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం 33 కోట్లకి అమ్మారు. అంటే సగానికి సగం నష్టమే అన్నమాట. టాక్ ఎలా వున్నా వసూల్ విషయంలో ఈ సినిమా డిజాస్టర్ అని చెప్పాల్సిందే మరి.