నాగబాబు మొహంలో పుత్రికోత్సాహం కనపడుతుంది

Update: 2017-12-27 10:14 GMT

మెగా ఫ్యామిలీకి.. సినిమాకు విడదీయరాని అనుబంధం. అందుకే మిగిలిన అన్ని ఫ్యామిలీల కన్నా ఎక్కువమంది హీరోలు మెగా ఫ్యామిలీలోనే కనిపిస్తారు. చిరంజీవి ఫ్యామిలీ నుండి మగవాళ్లే కాదు ఆడవాళ్లు సైతం సినిమాతోనే తమ కెరీర్ డెవలప్ చేసుకున్నారు.

అయితే తాజాగా చిరంజీవి కూతురు సుస్మిత.. నాగ బాబు కూతురు నిహారిక కలిసి ఓ ఫంక్షన్ కు అటెండయ్యారు. అదే ఫంక్షన్ కి నాగ బాబు కూడా వెళ్లి అన్న కూతురు సుస్మిత, తన కూతురు నిహారికలతో కలిసి ఫోటోకు ఫోజిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటోలో నాగబాబు మొహం చూస్తుంటే..పుత్రికోత్సాహం బోలెడు సంతోషాన్ని ఇస్తుందని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.

సుస్మిత ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ తీసుకుని.... తరవాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. మళ్లీ తన తండ్రి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం తిరిగి వెనక్కి వచ్చి స్టయిలిస్ట్ గా పనిచేసింది. ఇక నాగ బాబు కూతురు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా..ప్రస్తుతం తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Similar News