గత మూడు నాలుగు నెలలుగా కోలీవుడ్ లో త్రిష మీద నిర్మాతలమండలి నిషేధం విదిస్తుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కారణం విక్రమ్ - కీర్తి సురేష్ - త్రిష హీరో హీరోయిన్స్ గా దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న సామీ 2 నుండి త్రిష ఉన్నట్టుండి తప్పుకోవడం వలన ఆ సినిమా దర్శక నిర్మాతలు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చెయ్యడంతో త్రిష మీద నిషేధం విధిస్తున్నారని అన్నారు. అయితే త్రిష సామి 2 నుండి తప్పుకోవడానికి ఆ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ అనే ప్రచారం జరిగింది.
ఎందుకంటే హీరోయిన్ గా కీర్తి సురేష్ ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉంది. కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అరడజను సినిమాలు పైగా చేస్తున్న కీర్తి సురేష్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సామి 2 లో సీనియర్ హీరోయిన్ త్రిష కి అన్యాయం చేస్తున్నారని.... అందుకే త్రిష చెప్పా పెట్టకుండా విక్రమ్ సామి 2 ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ విషయమై హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించింది. త్రిష సామి 2 నుండి తప్పుకోవడానికి తనకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అసలు సామి 2 సినిమాలో త్రిషతో తనకు కాంబినేషన్ సీన్లే లేవని.....అలాంటప్పుడు త్రిష సినిమా నుంచి వైదొలగడానికి తానెలా కారణమవుతానని ఘాటుగా స్పందించింది. అసలు సామి 2 నుండి త్రిష సినిమా నుంచి తప్పుకున్న కారణం తనకు తెలియదని చెప్పింది. అలాగే తాను అజిత్ సినిమా విశ్వాసంలో హీరోయిన్ గా చెయ్యడం లేదని క్లారిటీ ఇచ్చింది.