నాకు ఇంకా పెళ్లి కాలేదు

Update: 2017-11-21 11:00 GMT

మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ మరోసారి వార్తలలోకి ఎక్కింది. లేటెస్ట్ గా ఈ అమ్మడుపై సోషల్ మీడియాలో ఓ పుకారు వచ్చింది. లీడర్, మిరపకాయ్, మిర్చి లాంటి సినిమాల్లో నటించిన ఈ ఎన్నారై బ్యూటీ.. ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లి అక్కడే సెటిల్ అయింది. అలాగే సినిమాల్లో కూడా ఈమధ్యన అవకాశాలు లేక అమ్మడు లాంగ్ గ్యాప్ తీసుకుంది. అయితే అటు సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న రిచా అక్కడే విదేశాల్లో తన స్నేహితుడిని పెళ్లి చేసుకుందని.. ఇక పెళ్లి తో లైఫ్ లో సెటిల్ అయ్యిందనే న్యూస్ సోషల్ మీడియాని ఒక కుదుపు కుదిపింది.

మూడు రోజులనుండి సోషల్ మీడియాలో.. రిచా గంగోపాధ్యాయ తన స్నేహితుడ్నిపెళ్లి చేసుకుందంటూ..కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా పెళ్లి చేసుకుందని.. ఇలా పుకార్లు ఫుల్ స్టాప్ పెడుతూ..నేను ఇంకా పెళ్లి చేసుకోలేదని.... ఇంకా చదువుతూనే వున్నా అని... మిర్చి భామ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం చదువుపైనే దృష్టిపెట్టానని ప్రకటించిన రిచా, పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని మీడియాకు తప్పకుండా చెబుతానంటోంది. ఇంకా సినిమాల్లో నటించబోనని నా స్టడీస్ అయిపోయాక బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది.

Similar News