నా ఫ్యాన్స్ వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయి

Update: 2018-03-13 04:34 GMT

గతంలో డైరెక్టర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. డైరెక్టర్ ఏం చెబితే అదే ఫైనల్. ప్రస్తుతం కూడా కొంత మంది డైరెక్టర్స్ అలాంటి వారే ఉన్నారు. అయితే కొంత మంది హీరోస్ కి క్రేజ్ వచ్చేసరికి డైరెక్టర్స్ రేంజ్ తగ్గిపోతుంది. అటువంటి హీరోస్ లో నాని ఉన్నాడు.

హీరో నాని మొదటి సినిమా నుండి దాదాపు చిన్న డైరెక్టర్స్ లేదా కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేసాడు. ఎక్కువ సినిమాలు హిట్ అయినవి చిన్న సినిమాలు తీసిన డైరెక్టర్స్ తోనే. కానీ నాని...నా సినిమాలు డైరెక్టర్స్ వల్ల హిట్ అవ్వట్లేదు తన ఫ్యాన్స్ వల్ల హిట్ అవుతున్నాయి అని లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ముఖ్యంగా నేను సెలెక్ట్ చేసుకునే కథలు వల్లే సినిమాలు ఆడుతున్నాయి అని చెప్పాడు. అందుకే పెద్ద డైరెక్టర్స్ సినిమాలు వచ్చినా నేను ఒకే చేయట్లేదని.. పెద్ద డైరెక్టర్స్ సినిమాలు కూడా బోల్తా కొడుతున్నాయని నాని చెప్పుకొచ్చాడు. మొత్తంగా నాని అభిమానులే నా సక్సెస్ కి కారణం అని చెప్పాడు.

Similar News